ETV Bharat / bharat

మంగళవారం భారత్​-చైనా ఎల్​జీ స్థాయి చర్చలు

భారత్- చైనా సైన్యం మధ్య నాలుగో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మంగళవారం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు లద్దాఖ్​లో సైనిక ఉద్రిక్తతను తగ్గించి, ప్రతిష్టంభనను తొలగించడంలో భాగంగా ఈ సమావేశంలో తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Next round of Lt Gen-level talks between India and China on Tuesday: Sources
రేపే నాలుగో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు
author img

By

Published : Jul 13, 2020, 6:20 PM IST

సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తిస్థాయిలో శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా భారత్​ చైనా సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి అధికారుల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సైనిక ప్రతిష్టంభనను తొలగించడానికి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశాయి.

లద్దాఖ్​లోని చుశూల్ ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొనే విధంగా ఇరుదేశాల సైనికాధికారులు తుది రోడ్ ​మ్యాప్​ను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు.

తోక ముడిచిన డ్రాగన్

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం ప్రారంభించింది. భారత్​ డిమాండ్​ మేరకు... గోగ్రా, హాట్​స్ప్రింగ్స్, గల్వాన్ లోయలో పూర్తిగా బలగాలను ఉపసంహరించింది. పాంగొంగ్ సో ప్రాంతంలోని ఫింగర్-4 వద్ద సైన్యాన్ని గణనీయంగా తగ్గించింది. ఫింగర్-4, ఫింగర్-8 నుంచి బలగాలనూ పూర్తిగా వెనక్కి తరలించాలని భారత్​ స్పష్టం చేస్తోంది.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ చైనా విదేశాంగ మంత్రితో టెలిఫోన్ సంభాషణ తర్వాత గత సోమవారం నుంచి సరిహద్దులో సైనిక ఉపసంహరణ ప్రారంభమైంది.

ఇప్పటికే మూడుసార్లు

ఇరు దేశాల మధ్య ఇదివరకే మూడు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి భేటీలు జరిగాయి. జూన్ 6న జరిగిన తొలి సమావేశంలో ఇరుదేశాలు ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. అయితే జూన్ 15న పరిస్థితి మరింత దిగజారింది. గల్వాన్​ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగింది. అనంతరం జూన్ 22న మరో దఫా చర్చలు జరిగాయి. అనంతరం జూన్ 30 మూడో విడత సమావేశం జరిగింది. దశలవారీగా సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇందులో నిర్ణయించాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.