బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎన్డీఏ శాసనసభ్యులు ఈ నెల 15న(ఆదివారం) సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ(భాజపా), జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం), వికాస్ శీల్ ఇన్షాన్ పార్టీ(వీఐపీ)లు సమావేశానికి హాజరు కానున్నాయి.
నితీశ్ నివాసంలో జరిగే ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. భాజపా(74), జేడీయూ(43) కంటే 31స్థానాల్లో ఆధిక్యం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ నితీశ్ కుమార్(జేడీయూ)కే మరోమారు సీఎం పగ్గాలప్పగించేందుకు సన్నద్ధమవుతోంది కమలం పార్టీ.
ఇదీ చదవండి: 'బైడెన్ మద్దతుతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం'