ETV Bharat / bharat

మోదీ 'జీవిత చరిత్ర'పై కొత్త పుస్తకం విడుదల - MODI CHILDHOOD STORY

ప్రధాని మోదీ జీవిత చరిత్రపై కొత్త పుస్తకం విడుదలైంది. భారత​ మాజీ ప్రధాన న్యాయమూర్తి​ జస్టిస్​ కే.జి. బాలక్రిష్ణన్​ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

New biography on PM Modi released
ప్రధాని మోదీ 'జీవిత చరిత్ర' ఆవిష్కరణ
author img

By

Published : May 31, 2020, 2:31 PM IST

Updated : May 31, 2020, 2:42 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలని అందిరికీ ఉంటుంది. ఆయన బాల్యంలో ఎలా ఉండేవారో, ఏం చేసేవారో తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది. ఇలాంటివారి కోరికను తీర్చే దిశగా మోదీ జీవిత చరిత్రపై ఇవాళ కొత్త పుస్తకం విడుదలైంది. మోదీ బాల్యానికి సంబంధించి అరుదైన ఛాయా చిత్రాలు, ఆయన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయితలు.

దేశ ప్రధానిగా మోదీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. "నరేంద్ర మోదీ - హార్బింగర్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్​ అపోస్టల్ ఆఫ్ వరల్డ్ పీస్" పేరుతో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ కే.జి. బాలక్రిష్ణన్​ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

లాక్​డౌన్ కారణంగా పుస్తక ఆవిష్కరణ సామాజిక మాధ్యమాల ద్వారా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్​, అమెరికాకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

New biography on PM Modi released
పుస్తక ఆవిష్కరణ

ఈ పుస్తకానికి అమెరికా రచయిత, కవి ఎలిజబెత్​ హారన్​, ఇంటర్నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ జ్యూరిస్ట్స్​​ అధ్యక్షడు, ఆల్ ఇండియా బార్​ అసోసియేషన్​ ఛైర్మన్​ అగర్వాలా సహ రచయితలుగా వ్యవహరించారు.

మోదీ బాల్యంలోని అరుదైన ఛాయాచిత్రాలతో ఆయన జీవితం ఎలా మొదలైందో పుస్తకంలో తెలుస్తుంది. టీ అమ్మే స్థాయి నుంచి రెండోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యే వరకు ఆయన ఎంచుకున్న పంథాను చూపిస్తుంది. ఇప్పటివరకు మోదీ గురించి మనకు తెలియని ఎన్నో వాస్తవాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

- రచయితలు

ఈ పుస్తకాన్ని ఈ-బుక్​, హార్డ్​ కాపీ సదుపాయాలతో.. సుమారు 10 విదేశీ భాషలు, 10 దేశీయ భాషల్లో అందుబాటులో ఉంచారు.

Last Updated : May 31, 2020, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.