ETV Bharat / bharat

ఆ దేశంలోని 4,800మంది భారతీయులకు కరోనా​

సింగపూర్​లో ఉంటున్న భారతీయుల్లో 4వేల 800మందికి కరోనా వైరస్​ సోకినట్టు ఆ దేశంలోని భారత హై కమిషనర్​ జావెద్​ అష్రఫ్​ తెలిపారు. వారిలో 90శాతం మంది డార్మిటరీల్లో ఉంటున్న కార్మికులేనని పేర్కొన్నారు.

author img

By

Published : May 4, 2020, 1:15 PM IST

Slug Nearly 4,800 Indians are COVID-19 positive but with mild conditions in Singapore: Envoy
ఆ దేశంలోని 4,800మంది భారతీయులకు వైరస్​

సింగపూర్​లో ఏప్రిల్​ చివరి నాటికి 4వేల 800మంది భారతీయులకు కరోనా వైరస్​ సోకినట్లు సోకింది. వారిలో 90శాతం మంది ఆ దేశంలోని విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన డార్మిటరీల్లో ఉన్నవారే అని సింగపూర్​లోని భారత హై కమిషనర్​ జావెద్​ అష్రఫ్​ తెలిపారు. అయితే వారి ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపారు. డార్మిటరీల్లో పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నట్టు.. వైరస్​ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.

అయితే ఏప్రిల్ మధ్య వారాలతో పోల్చితే​.. చివరి నాటికి డార్మిటరీల్లోని రోజువారీ కేసుల సగటు తగ్గిందని భారత హై కమిషనర్​ స్పష్టం చేశారు.

వైరస్​తో ఇప్పటి వరకు ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరికి హృద్రోగ సమస్యలున్నాయి. మరొకరు వైరస్​ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి సుసైడ్​ చేసుకున్నారు. భారత్​లో లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో విమాన సేవలు లేనందును వారిని సింగపూర్​లోనే ఖననం చేశారు.

హై కమిషన్​ సేవలు...

మొత్తం 3వేల 500మంది భారతీయులు.. భారత హైకమిషన్​ను సంప్రదించారు. అందులో విద్యార్థులు, వైద్యులు, నిపుణులు కూడా ఉన్నారు. కొందరు భారత్​కు పంపాలని అభ్యర్థించగా.. మరికొందరు వసతి, ఆహార భద్రత కోరారు. పరిస్థితులు మెరుగుపడ్డాక వారిని భారత్​కు పంపే ఏర్పాట్లు చేస్తామని అష్రఫ్​ తెలిపారు.

భారత కార్మికుల సంక్షేమం కోసం సింగపూర్​ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు ఆష్రఫ్​ పేర్కొన్నారు. విదేశీ కార్మికులకు స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వారి కోసం భారత ప్రభుత్వం కూడా తమ వంతు సహాయం చేస్తోందని అష్రఫ్​ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య మందులు, ఆహార ఉత్పత్తుల సరఫరా జరుగుతున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి:- 'అది​ భారత్​లో అంతర్భాగం.. వెంటనే ఖాళీ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.