ETV Bharat / bharat

'మహా'రాజకీయం: సోనియాగాంధీ, శరద్​పవార్ భేటీ వాయిదా

ఆదివారం దిల్లీలో జరగాల్సిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్​సీపీ నేత శరద్​ పవార్​ల భేటీ వాయిదా పడింది. పుణెలో ఇవాళ ఎన్​సీపీ కోర్​ కమిటీ సమావేశం ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. అయితే మరలా ఈ ఇరువురు నేతల సమావేశం ఎప్పుడు ఉంటుందో ఇరుపార్టీలు స్పష్టం చేయలేదు.

సోనియాగాంధీ, శరద్​పవార్ భేటీ వాయిదా
author img

By

Published : Nov 17, 2019, 4:51 AM IST

Updated : Nov 17, 2019, 7:57 AM IST

'మహా'రాజకీయం: సోనియాగాంధీ, శరద్​పవార్ భేటీ వాయిదా

దిల్లీలో నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ల మధ్య జరగాల్సిన భేటీ వాయిదా పడింది. పుణెలో ఆదివారం ఎన్​సీపీ కోర్ కమిటీ సమావేశం జరుగనుండడమే ఇందుకు కారణమని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మరలా ఈ ఇరువురు నేతల సమావేశం ఎప్పుడు ఉంటుందో మాత్రం స్పష్టం చేయలేదు.

మహారాష్ట్రలో శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయమై ఆదివారం భేటీ కావాలని శరద్​పవార్, సోనియాగాంధీ తొలుత నిర్ణయించారు. అయితే తాజాగా ఈ భేటీ వాయిదా పడింది.

"ఎన్​సీపీ కోర్​ కమిటీ సమావేశం పుణెలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాతనే పవార్ దిల్లీ బయలుదేరి వెళ్లాలి. కనుక ఆదివారం సోనియాతో శరద్​పవార్ భేటీ అయ్యే అవకాశాలు తక్కువ."- ఎన్​సీపీ వర్గాలు

గవర్నర్​తో ఎన్సీపీ, కాంగ్రెస్, సేన నేతల భేటీ వాయిదా

మహారాష్ట్రలో వరదల కారణంగా రైతులకు కలిగిన నష్టంపై రాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీతో చర్చించేందుకు నేడు సమావేశం కావాలని నిర్ణయించినప్పటికీ.. ఈ భేటీని వాయిదా వేశాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​. వ్యవసాయ సమస్యలపైన చర్చించేందుకేనని ఆయా పార్టీల నేతలు చెప్పుకొస్తున్నప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసమేననే ఊహాగానాలు ఉన్నాయి.

మనకేంటి?

శివసేన, కాంగ్రెస్​తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే.. ఎన్​సీపీకి దక్కాల్సిన పోర్టుఫోలియోలపై కోర్​ కమిటీ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.

అహ్మద్​తో పవార్ భేటీ..

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి... శరద్​ పవార్ కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్​ పటేల్​ను సోమవారం లేదా మంగళవారం కలిసే అవకాశం ఉందని ఎన్​సీపీ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీతో పవార్​ భేటీ ఆ తరువాత జరుగవచ్చని ఎన్​సీపీ వర్గాలు పేర్కొన్నారు.

నిప్పు, ఉప్పు కలుస్తాయా?

మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠం విషయమై భాజపా-శివసేన మధ్య విబేధాలు రావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి పూనుకున్నాయి. ఇందుకోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించే పనిలో ఈ మూడు పార్టీలు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఆర్​కామ్​ డైరెక్టర్​ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

Rameswaram (Tamil Nadu), Nov 16 (ANI): Carcass of an Olive Ridley Turtle washed ashore at Sangumal Beach in Rameswaram on November 16. According to a fisherman, "The turtle may have hit a rock while swimming. This happens in this season." After post-mortem the body of the turtle was buried at the beach by forest officials
Last Updated : Nov 17, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.