దేశంలో కరోనాను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌తో ఖాళీగా ఉంటూ ఇబ్బంది పడే వారికి నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) తీపీ కబురు అందించింది. దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాలను ఉచితంగా తన అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ప్రజలకు పుస్తక పఠనం అలవాటు చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఎన్బీటీ వెబ్సైట్లో 100కు పైగా పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించింది.
"హిందీ, ఇంగ్లీష్, అసామీ, బంగ్లా, గుజరాతీ, మలయాళం, ఒడియా, మరాఠీ, కోక్బోరోక్, మిజో, బోడో, నేపాలీ, తమిళం, పంజాబీ, తెలుగు, కన్నడ, ఉర్దూ, సంస్కృత భాషలలో పుస్తకాలను అందుబాటులో ఉన్నాయి. పిల్లలు, యువకులు ఆసక్తి కనబరిచేలా కల్పిత, జీవితగాథలు, చరిత్ర, ప్రఖ్యాత శాస్త్రీయ, టీచర్స్ హ్యాండ్‌బుక్స్ వెబ్సైట్లో ఉన్నాయి."
హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి.
వీటితో పాటు ఠాగూర్, ప్రేమ్‌చంద్ రాసిన పుస్తకాలు, మహత్మ గాంధీకి చెందిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కుటుంబమంతా కలిసి చదువుకునేలా మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకాలను సంబంధించిన పీడిఎఫ్లను కేవలం చదవటానికి మాత్రమేనని, వాటిని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదని స్పష్టంచేశారు.
ఎయిర్టెల్ కూడా..
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కూడా లాక్డౌన్ నేపథ్యంలో తన ఈ- బుక్ ఫ్లాట్‌ఫారం ద్వారా ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పుస్తక పఠనం అలవాటు చేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీపీఓ ఆదర్ష్ నాయర్ తెలిపారు.
ఇదీ చూడండి:మోదీజీ... ఆ విషయంలో నా పూర్తి మద్దతు: సోనియా