ETV Bharat / bharat

'భారత జీవన విధానాన్ని ప్రోత్సహించాలి' - India tradition

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మైసూరు 25వ పాలకుడు జయ చామరాజా వడియార్​ జయంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు వెంకయ్యనాయుడు.

Naidu asks people to promote Indian tradition of living, working together
'భారత జీవన విధానాన్ని ప్రోత్సహించాలి'
author img

By

Published : Jul 18, 2020, 4:53 PM IST

భారత సంప్రదాయాన్ని సంరక్షించడానికి అందరం కలిసి పని చేయాలని ప్రజలకు సూచించారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. పంచుకోవడం, పరిరక్షించడం వంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. మైసూరు 25వ​ పాలకుడు జయ చామరాజా వడియార్​ జయంతి వేడుకలను పురస్కరించుకొని వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా ప్రసంగించారు ఉపరాష్ట్రపతి.

చరిత్రను సృష్టించిన గొప్ప పాలకుడి రాజనీతి, జ్ఞానం, దేశభక్తిని దృష్టిలో ఉంచుకొని వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు నాయుడు.

''మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జీవించడం, ఐక్యతతో పనిచేయడమే శ్రీ జయ చామరాజా వంటి ప్రతిభావంతులకు మనం అర్పించగల గొప్ప నివాళి.''

- వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి: లద్దాఖ్‌లో పారాట్రూపర్ల అద్భుత విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.