ముంబయి.... దేశ ఆర్థిక రాజధాని. అత్యధిక జనాభా ఉన్న నగరాల జాబితాలో దిల్లీ తర్వాతి స్థానం ముంబయిదే. అలాంటి మహా నగరంలో వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. 'ముంబయి 24X7' ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.
ఏంటీ 'ముంబయి 24X7'?
ప్రస్తుతం వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లను రాత్రి వేళ మూసి ఉంచాల్సి వస్తోంది. 'ముంబయి 24X7' విధానం అమలుతో వారం రోజులు, ప్రతి రోజూ 24 గంటలపాటు తెరిచి ఉంచి, వ్యాపారం సాగించవచ్చు. అయితే... నివాస ప్రాంతాలకు ఈ విధానం వర్తించదు. వాణిజ్య ప్రాంతాలైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్లో మాత్రం ఈ వెసులుబాటు ఉంటుంది. కొత్త విధానం ఈనెల 27 నుంచి అమల్లోకి రానుంది.
ఇదీ చూడండి: సెంట్రల్ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత