ETV Bharat / bharat

పార్లమెంట్​ సిబ్బందికి రోజూ కరోనా పరీక్షలు - పార్లమెంట్ సిబ్బంది, విలేకరులకు ప్రతీరోజు కరోనా టెస్టులు

కరోనా పరీక్షలకు సంబంధించి పార్లమెంట్ వర్గాలు నూతన విధానాన్ని తీసుకొచ్చాయి. సిబ్బందికి, విలేకర్లకు ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడాన్ని తప్పనిసరి చేశాయి. ఎంపీలు కూడా వీలైనన్ని సార్లు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు చేయించుకునే వీలు కల్పించాయి.

Monsoon session: Mandatory daily corona test for reporters, Parliament staff
పార్లమెంట్​ సిబ్బందికి ప్రతీరోజు కరోనా పరీక్షలు
author img

By

Published : Sep 18, 2020, 1:24 PM IST

ఎంపీలు, పార్లమెంట్ సిబ్బంది, విలేకర్లు కరోనా బారిన పడుతున్న వేళ పార్లమెంట్ వర్గాలు నూతన విధానాన్ని తీసుకువచ్చాయి. ఇకపై పార్లమెంట్ సిబ్బందికి, సమావేశాలను కవర్ చేసేందుకు వచ్చే విలేకర్లకు రోజూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించడాన్ని తప్పనిసరి చేశారు.

ఇదే సమయంలో ఎంపీలందరూ వీలైనన్ని సార్లు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలను స్వచ్ఛందంగా చేయించుకునే వీలు కల్పించారు. బిల్లులపై చర్చ సందర్భంగా మంత్రుల వెంబడి వచ్చే అధికారులు సైతం కరోనా నెగటివ్ రిపోర్టును తీసుకురావడాన్ని తప్పనిసరి చేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చేసిన పరీక్షల్లో పలువురు ఎంపీలు కరోనా బారినపడినట్లు తేలిన నేపథ్యంలో పార్లమెంట్ వర్గాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

For All Latest Updates

TAGGED:

parl virus
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.