గుజరాత్‌వాసి దిలిప్ పొద్దర్ సూరత్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్. శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళ్తునప్పుడు దిలిప్కు ఓ బ్యాగు కనపడింది. బ్యాగు తెరిచి చూస్తే చాలా నోట్లు ఉన్నాయి. ఆ బ్యాగును తనతో పాటు తీసుకెళ్లకుండా బ్యాగు యజమానికి అప్పగించాలనుకున్నాడు. వెంటనే తను పనిచేస్తోన్న షాపింగ్ మాల్ మెనేజర్‌కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. బ్యాగు యజమాని ఆచూకీ లభించేంతవరకు బ్యాగు తన వద్దే ఉంచుకోమని మెనేజర్ సూచించాడు. అనంతరం పోలీసులకు సమాచారమందించాడు. సీసీ టీవి ద్వారా బ్యాగు యజమానిని గుర్తించిన పోలీసులు అతనికి సమాచారం అందజేశారు.
యజమానికి పోలీసులు బ్యాగును అప్పగించారు. నిజం తెలుసుకున్న యజమాని పొద్దర్ నిజాయతీకి మెచ్చి అతడికి లక్ష రుపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఓ నగల దుకాణ యజమాని పొద్దర్‌కు మరో లక్ష రూపాయిలు అందిచాడు. బ్యాగు యజమాని ఆ ధనాన్ని నగలు కొనడానికి ఉపయోగించారని నగల దుకాణ యజమాని తెలిపాడు.
అన్నం తిని ఇంటికి బయల్దేరాను. రోడ్డుపై బ్యాగు కనిపించింది. తెరిచి చూస్తే అన్నీ రెండు వేల రూపాయిల నోట్ల కట్టలున్నాయి. బ్యాగు ఎవరిదని చుట్టు పక్కల మొత్తం వెతికాను. ఎవరూ కనిపించలేదు. మా షాపు యజమానికి సమాచారం అందించాను. ప్రస్తుతం ఇంటికి తీసుకువెళ్లు, తరువాత వారిని వెతికి ఇద్దామని మెనేజర్ చెప్పారు. యజమానికి డబ్బు చేరినందుకు బహుమానంగా రెండు లక్షల రూపాయలు అందుకున్నాను. వాటిని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగిస్తాను.- దిలిప్ పొద్దర్, సేల్స్‌మెన్