ETV Bharat / bharat

'కేంద్రం అసమర్థత వల్లే చైనా దూకుడు' - రాహుల్ వీడియో ట్వీట్​

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకునేందుకు ప్రారంభించిన వీడియో సిరీస్​లో మొదటి వీడియో విడుదల చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కేంద్ర ప్రభుత్వ అసమర్ధత విధానాల వల్లే చైనా సరిహద్దులో దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

Modi's 'indiscretions' weakened India, left it vulnerable: Rahul on border standoff
'కేంద్రం అసమర్థత వల్లే సరిహద్దులో చైనా దూకుడు'
author img

By

Published : Jul 17, 2020, 4:47 PM IST

కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తన ఆలోచనలను ప్రజలతో పంచుకునేందుకు ప్రారంభించిన వీడియో సిరీస్‌లో... మొదటి వీడియోను రాహుల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.

  • Since 2014, the PM's constant blunders and indiscretions have fundamentally weakened India and left us vulnerable.

    Empty words don't suffice in the world of geopolitics. pic.twitter.com/XM6PXcRuFh

    — Rahul Gandhi (@RahulGandhi) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశాన్ని బలహీనపరిచాయన్న రాహుల్‌.. గత ఆరేళ్లుగా దేశ విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థకు చెల్లాచెదురయ్యాయని విమర్శించారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంలో లోపాలు, పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలోనే సరిహద్దుల్లో... చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

దేశ రక్షణకు అన్ని వ్యవస్థలు దోహదం చేస్తాయన్న విషయాన్ని మోదీ విస్మరించారన్న రాహుల్‌.. కేంద్ర వైఫల్యం వల్లనే లద్ధాఖ్ ‌ఘటన జరిగిందని విమర్శించారు. నిరుద్యోగిత రేటు గత 5 దశాబ్ధాలలో అత్యధికంగా నమోదైందన్న ఆయన మోదీ పాలనలో మన బలాలే అకస్మాత్తుగా బలహీనతలుగా మారాయని విమర్శించారు.

20 లక్షల కేసులు...

కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే ఈ ఆగస్టు నాటికి దేశంలో కొవిడ్ కేసులు 20 లక్షలకు పైగా పెరగడం ఖాయమని అంచనా వేశారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా వైరస్ నివారణ కోసం దృఢమైన, ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మోదీ సర్కార్ విదేశాంగ విధానం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్ఠ మసకబారుతోందంటూ పలు రకాల సమస్యలపై గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు.

ఇదీ చూడండి:పట్టపగలే బ్యాంక్ దోపిడీ.. కత్తులతో బెదిరించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.