ETV Bharat / bharat

'వీరత్వంతోనే శాంతి- మన శక్తి, సామర్థ్యాలు అమేయం' - సైనికులను ఉద్దేశించి మోదీ ప్రసంగం

సరిహద్దు వద్ద వీరసైనికులు ఉన్నంత వరకు దేశం నిశ్చింతగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ప్రజల ఆశీస్సులు సైనికులకు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. భారత సైనికుల శక్తి,సామర్థ్యాలు అజేయమని మోదీ వ్యాఖ్యానించారు.

modi speech in ladakh
భారత్‌శక్తి సామర్థ్యాలు అజేయం: మోదీ
author img

By

Published : Jul 3, 2020, 2:48 PM IST

Updated : Jul 3, 2020, 3:22 PM IST

భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ ఆకస్మికంగా లాద్దాఖ్ పర్యటన చేపట్టారు. ​గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం లద్దాఖ్​లో 11వేల అడుగులు ఎత్తులోని నిము ప్రాంతంలో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో మోదీ భేటీ అయ్యారు. సరిహద్దులో సైనిక సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.

వీర సైనికులకు భరోసా

సైన్యం సన్నద్ధతను సమీక్షించిన ప్రధాని మోదీ.. తరువాత సరిహద్దు ఘర్షణలో చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పించారు. భారత సైనికుల శక్తి,సామర్థ్యాలు అజేయమని ఆయన వ్యాఖ్యానించారు.

"సరిహద్దుల్లో మీరు (వీర సైనికులు) ఉన్నంత వరకు దేశం మొత్తం నిశ్చింతగా ఉంటుందన్న భరోసా ఉంది. మీకు దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి భారత్​ శక్తి ఏమిటో మీరు చూపించారు. మీ శౌర్య పరాక్రమాల గురించి నేడు ఇంటింటా మాట్లాడుకుంటున్నారు.

ఈ భూమి వీర భూమి. వీరులను కన్న భూమి. మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తయినది. వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను మనం తిప్పికొట్టాం. ఇవాళ భారత్‌ శక్తి సామర్థ్యాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతం. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుంది. బలహీనులు ఎప్పటికీ శాంతిని సాధించలేరు. అనేక సంక్లిష్ట, సంక్షోభ సమయాల్లో ప్రపంచం వెంట భారత్‌ నడిచింది. ప్రపంచ యుద్ధాల్లోనైనా, ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయుల ధైర్యసాహసాల్ని చూసింది.

మనం వేణువు ఊదే కృష్ణుడిని పూజిస్తాం.. అలాగే సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడినీ ఆరాధిస్తాం. సామ్రాజ్యవాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి పథాన సాగాల్సిన సమయం. ఇంతకాలం విస్తరణకాంక్షతో సాగిన శక్తులు తోకముడవడమో లేక ఓటమో చవిచూశాయి. దీనికి చరిత్రే సాక్షం"

- నరేంద్ర మోదీ, ప్రధాని

విచ్ఛిన్న శక్తులను తరిమికొట్టారు

లద్దాఖ్ 130 కోట్ల భారతీయులకు ప్రతీక అని.. విచ్ఛిన్న శక్తుల కుట్రలను లద్దాఖ్ ప్రజలు తిప్పికొట్టారని మోదీ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: నేపాల్​ రాష్ట్రపతితో ఎన్​సీపీ అధ్యక్షుడు ప్రచండ భేటీ

Last Updated : Jul 3, 2020, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.