ETV Bharat / bharat

మోదీ 2.0: పాలన కేంద్రంగా సెంట్రల్‌ విస్టా - one year of modi governance

పరిపాలన విభాగాలన్నింటినీ ఒకే చోటికి తెచ్చే లక్ష్యంతో దిల్లీ ల్యూటియెన్స్​ ప్రాంతంలో అధునాతన నిర్మాణాలతో సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు చేపట్టింది రెండోసారి కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు. మోదీ ప్రభుత్వం మానస పుత్రికైన ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికల్ని వేగవంతం చేసింది. 2022లో దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సందర్భానికి గుర్తుగా కొత్త పార్లమెంటు భవనాన్ని పూర్తిచేసి ప్రారంభించాలనేది లక్ష్యం. మొత్తం సెంట్రల్‌ విస్టాను 2024 నాటికి పూర్తి చేస్తారు.

Central Vista
మోదీ 2.0: పాలన కేంద్రంగా సెంట్రల్‌ విస్టా
author img

By

Published : May 30, 2020, 12:32 PM IST

దేశ రాజధాని ఔన్నత్యానికి ప్రతీక ల్యూటియెన్స్‌ దిల్లీ ప్రాంతం. భారత ప్రజాస్వామ్యం, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతిరూపాలైన రాష్ట్రపతి భవన్‌, పార్లమెంటు భవనం, నార్త్‌, సౌత్‌ బ్లాక్‌ల నిలయమిది. వీటికి అభిముఖంగా 3.2 కిలోమీటర్ల దూరంలోని ఇండియా గేట్‌ వరకు విస్తరించిన రాజ్‌పథ్‌ ప్రాంతం దిల్లీ పర్యాటకానికి చిరునామా. పరిపాలన విభాగాలన్నింటినీ ఒకే చోటికి తెచ్చే లక్ష్యంతో, అధునాతన నిర్మాణాలతో ఈ మొత్తం ప్రాంతానికి మరింత వన్నెలద్దాలని భావించిన నరేంద్రమోదీ సర్కారు- గత ఏడాది రెండోసారి కొలువుతీరిన తర్వాత ‘సెంట్రల్‌ విస్టా’ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికల్ని వేగవంతం చేసింది.

ఏమిటీ ప్రాజెక్టు?

దేశ రాజధానిలోని దాదాపు 51 మంత్రిత్వశాఖలు, వాటి విభాగాలన్నింటినీ దండలోని పూలలాగా ఒక చోటుకు తీసుకురావడం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. రాష్ట్రపతి భవన్‌-ఇండియా గేట్‌ మధ్యనున్న ప్రాంతంలో రేపటి అవసరాలకు అనుగుణంగా కొత్త పార్లమెంటు, సెంట్రల్‌ సెక్రటేరియేట్‌ నిర్మాణాలు చేపట్టడం ప్రధాన లక్ష్యం.

  • 70 వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా రాష్ట్రపతి భవన్‌కు కుడి ఎడమల ఒక్కోటి 8 అంతస్తులతో 10 భారీ భవంతుల్ని నిర్మిస్తారు.
  • ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి నివాసాలను కూడా రాష్ట్రపతి భవన్‌కు కుడిఎడమల నిర్మించి, మొత్తం వ్యవస్థలన్నింటినీ కేంద్రీకృత హారంలోకి తెస్తారు.

ఇవీ ప్రాజెక్టు విశేషాలు..

ఞఅంచనా వ్యయం: తొలుత దీనికి రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అనుకున్నా.. ఇప్పుడది రూ.20 వేల కోట్లకు చేరిందని అంచనా.
నిర్మాణ సంస్థ: హెచ్‌సీపీ డిజైన్స్‌(గుజరాత్‌)

ఎప్పట్లోగా పూర్తి?: కోటి చదరపు అడుగుల స్థలం నిర్మాణాన్ని అయిదేళ్లలోపు పూర్తిచేస్తారు. 2022లో దేశం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొనే సందర్భానికి గుర్తుగా పార్లమెంటు భవనాన్ని పూర్తిచేసి ప్రారంభించాలనేది లక్ష్యం. మొత్తం సెంట్రల్‌ విస్టాను 2024 నాటికి పూర్తి చేస్తారు.

ప్రస్తుతం ల్యూటియెన్స్‌ జోన్‌లో ఉన్న కార్యాలయాలు, నివాసాలు

  1. రాష్ట్రపతి భవన్‌
  2. పార్లమెంటు
  3. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసాలు
  4. సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టు, కిందిస్థాయి కోర్టులు
  5. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు
  6. ఎంపీలు, మంత్రులు, న్యాయమూర్తులు, త్రివిధ దళాధిపతుల కార్యాలయాలు, నివాసాలు

పార్లమెంటు కొత్త భవనం

Central Vista
పార్లమెంటు కొత్త భవనం

ప్రస్తుతం 790 సీట్ల సామర్థ్యంతో లోక్‌సభ, రాజ్యసభ, సెంట్రల్‌ హాల్‌గా పార్లమెంటు భవనం ఉంది. దీని పక్కనే కొత్త భవనాన్ని నిర్మిస్తారు. 2026 తర్వాత పార్లమెంటులో ఎంపీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ అవసరాల దృష్ట్యా లోక్‌సభలో 900 మంది, రాజ్యసభలో 450 మంది కూర్చునేలా తీర్చిదిద్దుతారు. ఉమ్మడి సమావేశాల వేదికగా లోక్‌సభనే వినియోగించుకునేలా అందులో 1350 మంది కూర్చునేలా సౌకర్యాలు కల్పిస్తారు. పాత పార్లమెంటు భవనాన్ని మ్యూజియం లేదా ఇతరత్రా పార్లమెంటు అనుబంధ సేవలకు వినియోగిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.