ETV Bharat / bharat

ఆ రెండు రాష్ట్రాల్లో లాక్​డౌన్​ పొడిగింపు

mizoram Chief Minister Zoramthanga decides to impose 2-week total lockdown
ఆ రెండు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్​డౌన్​
author img

By

Published : Jun 8, 2020, 4:53 PM IST

Updated : Jun 8, 2020, 6:12 PM IST

17:57 June 08

కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బంగాల్​, మిజోరం రాష్ట్రాలు లాక్​డౌన్​ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా సంప్రదింపుల కమిటీతో చర్చలు జరిపి... రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

మిజోరంలో ఇప్పటి వరకు 34 మంది వైరస్​ బారిన పడ్డారు.

జూన్​ 30 వరకు..

బంగాల్​లోనూ కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో జూన్​ 30 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 

బంగాల్​లో ఇప్పటి వరకు 8,187 మంది వైరస్​ బారిన పడగా... 396 మంది మృతి చెందారు.

సడలింపులతో కూడిన లాక్​డౌన్​ 5.0ను జూన్​ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి స్థాయి లాక్​డౌన్​ను మాత్రం కేవలం కంటైన్​మెంట్​ జోన్లకు పరిమితం చేసింది. ఈ నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆయా రాష్ట్రాలు.

16:48 June 08

కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో  బంగాల్​,  మిజోరంలో లాక్​డౌన్​ పొడిగించాలని ఆయా ప్రభుత్వాలు నిర్ణయించాయి. మంగళవారం నుంచి రెండు వారాల పాటు మిజోరంలో.. ఈ నెల 30వరకు బంగాల్​లో లాక్​డౌన్​ను పొడిగిస్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Jun 8, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.