ETV Bharat / bharat

మధ్యాహ్న భోజన పథకం .. ఇలా చేస్తే ఉభయతారకం - మధ్యాహ్న భోజన పథకం

పేద పిల్లలకు చదువుతో పాటు కడుపు నింపాలనే గొప్ప ఆలోచనతో రూపొందించినదే మధ్యాహ్న భోజన పథకం. అయితే దీని అమలులో అనేక రాష్ట్రాలు తప్పటగులు వేస్తుండడం దురదృష్టకరం. ఇలాంటి సమయంలో చిరుధాన్యాల వంటలతో పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ప్రయత్నాలు జరుగుతుండడం కొంత ఆనందించాల్సిన విషయం.

mid day meal scheme problems and remedies
మధ్యాహ్న భోజన పథకం .. ఇలా చేస్తే ఉభయతారకం
author img

By

Published : Dec 20, 2019, 7:58 AM IST

ఆకలిమంటల్లో బడిఈడు పిల్లల బాల్యం, చదువు కమిలిపోరాదన్న సదుద్దేశంతో దాదాపు పాతికేళ్లక్రితం దేశంలో రూపుదాల్చిన విశిష్ట పథకం- ‘మధ్యాహ్న భోజనం’. అది నేటికీ అనేక రాష్ట్రాల్లో తప్పటడుగులు వేస్తుండటం దురదృష్టం. ‘ప్రాథమిక విద్యకు పౌష్టికాహార దన్ను’గా తొలుత నిర్దేశించిన మేరకు ప్రతి విద్యార్థికీ రోజుకు 300 క్యాలరీలు, 8-12 గ్రాముల మాంసకృత్తులు ఏడాదిలో కనీసం రెండువందల రోజులపాటు అందించాలి. దరిమిలా ప్రాథమిక తరగతుల్లోనివారికి 450 క్యాలరీలు, 12 గ్రాముల మాంసకృత్తులు; ప్రాథమికోన్నత విద్యార్థులకు 700 క్యాలరీలు, 20 గ్రాముల మాంసకృత్తులు సమకూడేలా పథకాన్ని పరిపుష్టీకరించారు. బడిఈడు పిల్లలకు మధ్యాహ్న భోజనం చట్టబద్ధ హక్కుగా సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టీకరించినా- వాస్తవిక కార్యాచరణలో ఆ స్ఫూర్తి కొల్లబోతున్నట్లు రాష్ట్రాలవారీగా అనేక ఉదంతాలు చాటుతున్నాయి. పదిహేడు రాష్ట్రాల్లో పిల్లలకు వడ్డిస్తున్నది అరకొర భోజనమేనని పదేళ్లక్రితం కేంద్రప్రభుత్వ అధ్యయనమే ధ్రువీకరించింది. ఆ తరవాతా పరిస్థితి తేటపడలేదనడానికి- పర్యవేక్షణ లోపాలకు, మొక్కుబడి తనిఖీలకు భోజన నాణ్యత బలవుతోందన్న కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదికాంశాలే రుజువు. వేలకోట్ల రూపాయలు వెచ్చించి 11 లక్షలకుపైగా పాఠశాలల్లో సుమారు తొమ్మిది కోట్లమంది పిల్లలకు భూరి పథకం అమలు పరుస్తున్నామంటున్నా- లీటరు పాలలో నీళ్లు కలిపి 81 మందికి పంచిన యూపీ బాగోతం వంటివి దిగ్భ్రాంతపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మూడోవంతు పిల్లల్ని పౌష్టికాహార లోపాలు కుంగదీస్తున్నాయని, ఎకాయెకి 38శాతం వయసుకు తగ్గ ఎత్తు ఎదగక గిడసబారి పోతున్నారన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- రుచికరమైన సమతుల ఆహారం ఎందరికో అందని మానిపండయిందని నిగ్గుతేల్చింది. మధ్యాహ్న భోజనంలో వరి, గోధుమల స్థానే సజ్జలు, కొర్రల వంటి చిరుధాన్యాలతో సిద్ధంచేసిన ఆహారం పిల్లల్లో యాభైశాతం అధిక వృద్ధికి దోహదపడుతుందంటున్న తాజా అధ్యయనం- మెరుగైన ప్రత్యామ్నాయాలు చేరువలోనే ఉన్నాయంటోంది!

పోషకాహారం అందిస్తున్నామా?

ఇక్రిశాట్‌ (అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం), ‘అక్షయ పాత్ర’ల సంయుక్త అధ్యయనం చిరుధాన్యాలతో కూడిన సిద్ధాహారం పిల్లలకెంత మేలు చేయగలదో సోదాహరణంగా వెల్లడించింది. సాంబారన్నం తిన్న విద్యార్థులతో పోలిస్తే చిరుధాన్యాలతో తయారైన ఇడ్లీ, కిచిడీ, ఉప్మా వంటివి తీసుకున్నవారికి సమధికంగా పోషకాలు సమకూరాయన్న విశ్లేషణ- విస్తృత ప్రాతిపదికన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ప్రస్ఫుటీకరిస్తోంది! అంతర్జాతీయంగా సగటున ప్రతి లక్షమందిలో 178 మందిని అంటురోగాలు, 539మందిని జీవనశైలి రుగ్మతలు బలిగొంటున్నాయి. ఇండియాలో అటువంటి మరణాలు వరసగా 253, 682గా నమోదై భీతిల్లజేస్తున్నాయి. విపరీత ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే దాపురిస్తున్న మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలకు చిరుధాన్యాలు చక్కని పరిష్కారమన్న సూచనలకు నెమ్మదిగా ప్రాచుర్యం పెరుగుతోంది. గర్భిణులు, బాలబాలికల్లో తీవ్ర అనారోగ్య లక్షణాల్ని రాగులు, కొర్రలు, సజ్జలు, సామలు వంటివి ఉపశమింపజేయగలవన్న వాదనకు ‘నీతి ఆయోగ్‌’ గట్టిగా వత్తాసు పలుకుతోంది. ఒకప్పుడు విరివిగా చిరుధాన్యాల వాడకానికి నెలవైన భారత్‌లో కొన్ని దశాబ్దాలుగా వరి, గోధుమల వినియోగం విస్తారంగా పెరిగింది. సహజంగానే మధ్యాహ్న భోజన పథకంలోనూ వాటికే ప్రాధాన్యం దక్కింది. పిల్లల శారీరక, మానసిక, బుద్ధి కుశలతల వికాసానికి దోహదకారి కావాలీ అంటే- మధ్యాహ్న భోజనాన్ని బలవర్ధకంగా తీర్చిదిద్దాల్సిందే. సరైన భోజనానికి, తీరైన చదువులకు కోట్లాది పసిపిల్లలు మొహం వాచిపోయే దుస్థితి సువిశాల భారతదేశానికి ఎంతమాత్రం శోభనివ్వదు. దేశమంతటా ఆ దురవస్థను చెదరగొట్టే చొరవకు- పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు చేర్చడం సత్వరం నాంది పలకాలి!

చిరుధాన్యాలతో...

దేశవ్యాప్తంగా 14 కోట్ల హెక్టార్ల పంట భూముల విస్తీర్ణంలో మూడొంతుల దాకా సాగుకు వర్షాలే దిక్కవుతున్నాయి. పర్యావరణ సమతూకం దెబ్బతిని, రుతువులు గాడితప్పి, ఇంచుమించు ప్రతి సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఏదో ఒక పంట కరవు బారిన పడే ఉదంతాలు రైతాంగం బతుకుల్ని బీటలు వారుస్తున్నాయి. సకాలంలో వానలు లేక, భూగర్భ జలాలూ అడుగంటి వరి, చెరకు వంటివి సాగు చేసే రైతుల ఆశలు కొల్లబోతున్నాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తక్కువ నీటి వసతితో స్వల్ప కాల వ్యవధిలో చిరుధాన్యాల సేద్యం రైతుకు పెద్ద ఆసరా కాగలుగుతుంది. చౌడు, ఇసుక, బంజరు, నిస్సార భూముల్లోనూ జొన్నలు, సజ్జలు వంటి రకాల్ని పండించగల వీలుందంటున్న సేద్య నిపుణులు- వాటి సాగుతో నేల సైతం సారవంతమవుతుందనడం కళతప్పిన వ్యవసాయ రంగాన కొత్త ఆశలు మోసులెత్తించేదే! తనవంతుగా కర్ణాటక 2020నుంచీ మధ్యాహ్న భోజన పథకంలో చిరుధాన్యాలను చేర్చడానికి సన్నద్ధమవుతోంది. పన్నెండు రాష్ట్రాల్లో 16 లక్షలమందికిపైగా పిల్లలకు అనుదినం గోధుమలు, వరితో కూడిన భోజనం వండివారుస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌- ప్రభుత్వం సరఫరా చేయగలిగితే జొన్నలు, సజ్జలు, రాగులు తదితరాలతో ఆకలి కడుపులు నింపుతామంటోంది. దేశం నలుమూలలా అదే ఒరవడి స్థిరపడాలంటే- రైతాంగాన్ని జాగృతపరచి, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఇతోధికమయ్యేలా ప్రోత్సాహకాలు సమకూర్చి, అంగన్‌వాడీల్లో వసతి గృహాల్లో సైతం వంటకాల్ని మారుస్తూ విధి విధానాల్ని ప్రక్షాళించాలి. 2022నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం జాతికి మాటిచ్చింది. అన్ని రకాల చిరుధాన్యాలకూ గిట్టుబాటు లభించేలా పకడ్బందీ సేకరణ యంత్రాంగాన్ని కొలువుతీరిస్తే- రైతులకూ మేలు ఒనగూడుతుంది, పోషక లోపాల్ని అరికట్టగల దక్షతా ప్రభుత్వానికి చేకూరుతుంది!

ఇదీ చూడండి: 'నిజాం నిధుల కేసులో పాకిస్థాన్​కు మరో ఎదురుదెబ్బ'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Panama City - 15 December 2019
1. Mural with lettering reads (Spanish) "December 20th 1989, 30 years… National mourning"
2. Various of mural faces
3. Muralist repainting mural with green paint
4. SOUNDBITE (Spanish) Mario Enrique Patiño, widower who was living in the city the eve of the invasion:
"A Puerto Rican soldier told us in Spanish to go to church. Because the houses were all made of wood, they were beginning to burn. And a Puerto Rican American said that they wanted Noriega to surrender, because the guards were climbing on the roof of the large multi-family homes."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Panama City - 20 December 1989
++4:3++
5. Fire, zoom out to US soldier in foreground
6. Residents running down street after bombing of El Chorrillo neighbourhood with smoke from the bombing visible in the background
7. A US soldier crouching down during invasion
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Panama City - 7 December 2019
8. Iris Herrera walking feeding her geese
9. SOUNDBITE (Spanish) Iris Herrera, widow of Lieutenant Braulio Bethancourt:
Herrera recalling what Bethancourt said to her: "Take care for me. Take care of my children and take care of my grandchildren. Please do not come here, do not leave my children or my grandchildren."
Herrera: I told him, 'don't worry, I'll do it, you know I'll keep my word.'"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Panama City - (exact date unknown) March 1983
++4:3++
10. Mid of General Manuel Antonio Noriega, former leader of Panama
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Panama City - (exact date unknown) May 1989
++4:3++
11. Noriega shaking his fists during an election campaign, later won by Noriega's opposition (Noriega anniled the elections causing political and social turmoil)
US MARSHALS SERVICE HANDOUT VIA AP PHOTOS - AP CLIENTS ONLY
ARCHIVE: Miami, USA - 4 January 1990
12. STILL of Noriega posing for booking photo
US CUSTOMS HANDOUT - AP CLIENTS ONLY
ARCHIVE: Panama City - 3 January 1990
++NIGHT SHOTS++
++4:3++
13. US Drug Enforcement Agency with Noriega walking to board C130 plane that's to fly him to Miami after he surrendered to US authorities
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Panama City - 7 December 2019
14. Various of Iris in her kitchen
15. SOUNDBITE (Spanish) Iris Herrera, widow of Lieutenant Braulio Bethancourt:
"His little troop he had was of five people. They were sergeants, corporal and he, there were like four or five who were on a shift that (night of December) 19, and he says that he told them to go home that I'll stay guarding the barracks. He didn't want to leave the barracks, he waited for death there, in the barracks."
16. Iris holding her husband's uniform
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Panama City - 15 December 2019
17. Mural with Apache helicopter and words reading (Spanish) "No forget nor forgiving"
18. Muralist painting hair on one of the faces
19. SOUNDBITE (Spanish) Trinidad Ayola, President of the Association of Relatives and Friends of the Fallen of December 20, 1989:
"The association of the relatives has not received any kind of help. What's more, the exhumation that was done in the 90's. That was done by the will of the people, with donations made by the people."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Panama City - (exact date unknown) December
++4:3++
20. Various of people inside a refugee camp set up for people who lost their homes because they were destroyed during the invasion
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Panama City - 15 December 2019
21. SOUNDBITE (Spanish) Trinidad Ayola, President of the Association of Relatives and Friends of the Fallen of December 20, 1989:
"Now it's the other way around. Now there is a population that claims us when it is going to declare a national day of mourning. When will that date arrive?"
22. Aerial of Cemetery "Jardín de Paz" (Peace garden) and the skyline of the city behind it
STORYLINE:
Although it's been 30 years, Iris Herrera still vividly remembers the last conversation she had with her husband, a Panamanian soldier who disappeared after the December 20 US invasion that ousted dictator Manuel Noriega.
That night, Braulio Bethancourt, Herrera's husband, called her to say he was supposed to be on duty at a barracks in the capital.
"I want you to stay at home and take care of my grandchildren and children for me," she recalled him saying.
That was the last time Herrera heard from her husband, and the beginning of an agony that has lasted three decades - in which his whereabouts remain unknown.
Now 76, Herrera and many other relatives of people who died or disappeared amid the 1989 military action hope they may soon get answers about the fate of their loved ones.
Their hopes lie in a Truth Commission created in 2016 that so far has registered about 15 cases that could be resolved early next year when unidentified bodies are set to be exhumed from a Panama City cemetery.
The United States launched "Operation Just Cause" on December 20, 1990 shortly after midnight.
Some 27,000 troops were tasked by then-President George H.W. Bush with capturing Noriega, protecting the lives of Americans living in Panama and restoring democracy to the country that a decade later would take over control of the Panama Canal.
The invasion began with fierce bombing in the neighbourhood of El Chorrillo, home to Noriega's base, destroying wooden homes and displacing thousands of people.
Today the area still has desolate parts where residents say bombs fell, an iron light post pockmarked from bullets and graffiti with phrases like "Forbidden to forget" and "Dec. 20, national mourning."
Many of those who survived complain to this day about the small apartments that the government then gave them in multi-family, concrete buildings put up in the devastated neighbourhood after the invasion.
Residents of El Chorrillo, who historically have lived among violence and gang activity, also complain of poverty and joblessness.
According to official figures, 300 Panamanian soldiers and 214 civilians — many from El Chorrillo — died during the invasion, though the number remains controversial and human rights groups like the Association of Relatives of the Fallen believe it is much higher.
Twenty-three US soldiers also perished.
Many of the Panamanian dead were buried in common graves in a cemetery.
Months later, at the request of relatives, exhumations led to the identification of many of the bodies.
But that wasn't the case for Herrera and others.
Herrera, who at the time of the invasion worked as an auxiliary nurse for the military, said she and her husband's relatives put notices in the newspapers seeking any information about his whereabouts, but in vain.
The Truth Commission, which began working in 2017 and is made up of five legal and academic experts, collected court records and other documents plus new evidence and testimonies from victims' relatives.
With that new evidence, the commission was able to request the impending exhumations and the reopening of the cases of 15 people who disappeared.
The commission has compiled a DNA bank with biological samples from relatives that will be compared against the remains dug up.
Bethancourt's three sons have given blood samples.
This week relatives won a victory when the government declared Friday a day of national mourning for the first time.
Another moral victory came last year when the Inter-American Court of Human Rights issued a decision blaming the United States for the invasion and calling on it to pay compensation.
Washington considers it a mere recommendation and does not recognize the court, according to analysts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.