ఉత్తరాఖండ్ నైనిటాల్‌లోని ప్రాచీన మెట్రోపోల్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం దాదాపు పూర్తిగా దగ్ధమైంది.
కొన్నేళ్లుగా హోటల్ ప్రధాన భవనంలో వర్తక పన్ను కార్యాలయం నడుస్తోంది. రాత్రి అగ్నిప్రమాదం జరిగింది ఆ కార్యాలయంలోనే. ప్రమాద కారణాలను ఇంకా కనుగొనలేదని, ఎవరో దుండగులు కావాలనే నిప్పు పెట్టారని అనుమానిస్తున్నట్టు నైనిటాల్ సీఐ విజయ్ థాపా చెప్పారు.
చాలా ఏళ్లు ఖాళీగా...
ఎంతో విలాసవంతమైన ఈ హోటల్ అంటే పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాకు చాలా ఇష్టం. ఆయన చాలా రోజులు ఇక్కడ బస చేశారు. ఇక్కడే జిన్నా హనీమూన్ చేసుకున్నారు. మరెంతో మంది ప్రముఖులు, సినీతారలు గతంలో ఈ హోటల్ ఆతిథ్యం స్వీకరించారు.
ఎంతో ప్రాచీనమైన మెట్రోపోల్ హోటల్ చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. యజమాని మహారాజా మహమూదాబాద్ పాకిస్థాన్‌కి వెళ్లిపోయాక హోటల్ ఆస్తులపై కోర్టులో కేసు నడుస్తోంది.
ప్రస్తుతం కొందరు హోటల్‌ను వాహనాలు నిలుపుకునేందుకు వినియోగిస్తున్నారు. అయితే ప్రధాన కార్యాలయంలోనే ప్రమాదం సంభవించింది. వాహనాల వరకు మంటలు చేరుకోలేదు.