ETV Bharat / bharat

మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం 3 నెలలు పొడిగింపు

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్భంధ గడువును మరో మూడు నెలలు పొడిగించారు అధికారులు. ప్రస్తుత గడువు ముగియడానికి కొన్ని గంటలే ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు.

author img

By

Published : May 5, 2020, 10:49 PM IST

Mehbooba Mufti's detention
మహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం 3 నెలలు పొడిగింపు

ప్రజా భద్రత చట్టం కింద జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పొడిగించారు అధికారులు. ఈ మేరకు శ్రీనగర్ జిల్లా కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుత నిర్బంధ గడువు ముగియనున్న కొన్ని గంటల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5న ముఫ్తీకి నిర్బంధం విధించారు అధికారులు. అప్పటి నుంచి 8నెలల పాటు పోలీసులు ఏర్పాటు చేసిన రెండు సబ్ జైళ్లలో ఉంచారు. ఈ నెల 7నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధంలోనే ఉంచారు.

గృహ నిర్బంధంలో కశ్మీర్​ నేతలు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్​ అబ్దుల్లాలకు ఇటీవలే విముక్తి కల్పించారు అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.