భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం 87వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానిగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా మన్మోహన్సింగ్కు శుభాకాంక్షలు తెలిపారు.
"మన్మోహన్ జీ మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్..
"మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను."
-రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
సోనియా గాంధీ...
"మన్మోహన్ సింగ్కు 87వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో భారత్ ఎన్నో మైలు రాళ్లు దాటింది. ప్రస్తుత నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఇదీ చూడండి: రాబర్ట్ వాద్రాను కస్టడీకి అప్పగించండి: ఈడీ