రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పట్టణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో దిగ్విజయ్‌సింగ్‌కు చోటు కల్పించడం వల్ల ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. దిగ్విజయ్ స్థానంలో మన్మోహన్‌ను నియమించారు వెంకయ్య.
2014 నుంచి 2019 జూన్ వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడూ ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు మన్మోహన్.
గతంలో మన్మోహన్ సింగ్ రెండు పర్యాయాలు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 1991-96 మధ్యకాలంలో పీవీ నరసింహరావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పు 'సమీక్ష'పై త్వరలో నిర్ణయం!