ETV Bharat / bharat

కుమార్తె కోసం చెరువునే కడిగేసిన తండ్రి..!​ - తమిళనాడులోని తిరువరూర్​ జిల్లా

పిల్లలు ఏదైనా కావాలంటే వెంటనే ఇచ్చే తల్లిదండ్రులను చూసే ఉంటాం. కానీ ఊరికోసం ఏదైనా చేయండి అంటే మాట మీద నిల్చొనే వారిని ఎప్పుడైనా చూశారా? తమిళనాడులోని తిరువరూర్​ జిల్లాకు చెందిన ఓ తండ్రి తన కుమార్తె కోరిక మేరకు చెరువును పరిశుభ్రంగా మార్చాడు. మరి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది?

కుమార్తె సంతోషం కోసం స్వచ్ఛభారత్ చేసిన తండ్రి..!​
author img

By

Published : Sep 26, 2019, 6:12 AM IST

Updated : Oct 2, 2019, 1:18 AM IST

కుమార్తె సంతోషం కోసం స్వచ్ఛభారత్ చేసిన తండ్రి..!​
తన పాఠశాలకు సమీపంలోని చెరువులో వ్యర్థాలు పేరుకుపోయాయని.. దానిని శుభ్రం చేయాలని ఓ కుమార్తె కోరిన కోర్కెను తీర్చాడా తండ్రి. ఈ సంఘటన తమిళనాడులోని తిరువరూర్​ జిల్లాలో జరిగింది. చెత్త, మురుగుతో దుర్గంధం వెదజల్లుతూ అనారోగ్యానికి కారణమవుతుందన్న తన కూతురు మాటలతో.. ఈ పనికి పూనుకున్నాడు శివకుమార్​.

వివరాల్లోకి వెళ్తే... తిరువరూర్​ జిల్లాలోని మరుథవనమ్​ గ్రామంలో నివసించే శివకుమార్​, అరుల్​ మోజీ దంపతులకు ఇద్దరు సంతానం. పూల వ్యాపారంలో రోజుకూలీగా పనిచేసేవాడు శివకుమార్​. ఆయన ఆదాయం అంతంత మాత్రమే. కనీసం నిత్యావసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితి.

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. పిల్లల ముందే ఎప్పుడూ గొడవపడేవారు. కుమార్తె నదియా సమీప ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తన తండ్రి ఎప్పుడూ తల్లితో గొడవపడుతుండటంపై విసుగుచెందిన నదియా తండ్రితో మాట్లాడటం మానేసింది.

ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యేసరికి శివకుమార్​ సమీపంలోని తిర్​పూర్​ వెళ్లి పని వెతుక్కున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఇంటికొచ్చేవాడు. కానీ నదియా అతనితో మాట్లాడేది కాదు. 6 నెలలు గడిచాయి. తండ్రీ కుమార్తెల మధ్య మాటల్లేవు. ఒకరోజు తనతో మాట్లాడాలంటే ఏమి చేయాలని కుమార్తెను అడిగాడు శివకుమార్​. పాఠశాల సమీపంలోని చెరువును శుభ్రం చేస్తే మాట్లాడతానని చెప్పింది. కుమార్తె కోరిక మేరకు భార్యభర్తలు ఇద్దరు చెరువును పరిశుభ్రంగా మార్చారు.

"సెలవు సమయాల్లో ఇంటికి వచ్చినప్పుడు కూడా నా కూతురు మాట్లాడేది కాదు. నాతో మాట్లాడాలంటే నీకు బట్టలు ఇవ్వాలా, తినే వస్తువులు కొనివ్వాలా అని అడిగాను. ఏది కావాలన్నా ఇస్తానని చెప్పాను. అప్పుడు మా పాఠశాల సమీపంలోని చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయాలని కోరింది. ఆమె కోరిక మేరకు చెరువులోని చెత్తను తొలగించాం. "

- శివకుమార్​, నదియా తండ్రి.

ఇతరుల క్షేమం కోసం ఆరాటపడే తన కుమార్తెను చూసి గర్వంగా ఉందని పేర్కొన్నాడు శివకుమార్​.

ఇదీ చూడండి: ఒడిశా జాలర్లకు చిక్కిన భారీ చేప.. కిలో రూ.7వేలు

RESTRICTION SUMMARY: NO USE BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - RESTRICTION SUMMARY: NO USE BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 25 September 2019
1. Aerial of British Royal Air Force plane on airport tarmac
2. Various aerials of motorcade including vehicle carrying British Prime Minister Boris Johnson
3. Aerial of Johnson exiting car, walking into 10 Downing Street
UK POOL - AP CLIENTS ONLY
London - 25 September 2019
3. Johnson's vehicle arriving, Johnson exiting vehicle and walking into 10 Downing Street
STORYLINE:
UK Prime Minister Boris Johnson arrived in London on Wednesday as politicians returned to the House of Commons, following Britain's Supreme Court ruling that his suspension of Parliament was unlawful.
Johnson flew into Heathrow Airport from New York, where he was forced to cut short a trip to the United Nations General Assembly.
A motorcade, including a vehicle carrying Johnson, travelled to his residence at 10 Downing Street.
It was unclear whether Johnson would sit in the House of Commons on Wednesday.
Opposition members of Parliament are calling for his resignation following Tuesday's unanimous court ruling.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 1:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.