మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందిని నియమించింది ఈసీ. వీరు 269 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు అధికారులు.
మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలు ఉండగా..3 వేల 237 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 8 కోట్ల 98 లక్షల మంది ఓటర్లరో 61.13 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
288 అసెంబ్లీ స్థానాలతో పాటు సాతారా లోక్‌సభ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. ఎన్సీపీ ఎంపీ ఉదయ్నరాజే ఆ పార్టీకీ రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక నిర్వహించారు. ఉదయ్ నారాజే ఈసారి భాజపా నుంచి పోటీ చేశారు.
భాజపా-శివసేన కూటమి వైపే సర్వేలు..
భాజపా, శివసేన కూటమికి మూడింట రెండొంతుల మెజార్టీ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి: 'మహా'పోరు: గురువారమే ఫలితం- భాజపా జైత్రయాత్ర ఖాయమా?