మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం సంభవించింది. అరణ్యేశ్వర్లో భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది.
ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మరో రెండు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. సహకార్ నగర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సింఘార్ రోడ్డులో కొట్టుకువచ్చిన ఓ కారులో మరో మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు.
పుణె జిల్లాలో రెండురోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పురందర్, బారామతి, భోర్, హవేలిలో మండలాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్ నావల్ కిషోర్ రామ్ సెలవు ప్రకటించారు.
ఇదీ చూడండి: మృత్యువు అంచుల వరకు వెళ్లి బతికాడు!