ETV Bharat / bharat

'మహా'లో మళ్లీ భూకంపం- 3.5 తీవ్రత నమోదు

మహారాష్ట్రలో మరోసారి భూ ప్రకంపనలు రావడం స్థానికుల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పాల్​ఘర్​ జిల్లాలో సోమవారం రిక్టర్​ స్కేలుపై 3.5గా తీవ్రతతో భూమి కంపించింది. అయితే ఈ ఘటన వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు.

Maharashtra: Mild earthquake hits Palghar, no casualty
'మహా'లో మరోసారి భూకంపం- రిక్టర్​ స్కేలుపై 3.5 తీవ్రత
author img

By

Published : Sep 7, 2020, 12:11 PM IST

మహారాష్ట్రలో మరోసారి భూమి కంపించింది. పాల్​ఘర్​ ప్రాంతంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించగా.. రిక్టర్​ స్కేలుపై 3.5గా తీవ్రత నమోదైంది. అయితే ఈ ఘటనతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.

పాల్​ఘర్​ జిల్లా, డహను తాలుకా, పారస్వది ప్రాంతంలో ఉదయం 8.07 గంటలకు స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని జిల్లా విపత్తు నియంత్రణ అధికారి తెలిపారు.

గతవారంలోనే 4 సార్లు..

గత వారంలో కేవలం రెండు రోజుల వ్యవధి(శుక్ర, శనివారం)లో అక్కడ నాలుగు సార్లు భూకంపం వచ్చింది. పాల్​ఘర్​లోని డహను పరిసర ప్రాంతాల్లో 2018 నవంబర్​ నుంచి తరచూ ఇలా స్వల్పస్థాయి భూకంపాలు వస్తూనే ఉన్నాయి.

ఇదీ చదవండి: గుజరాత్​లో భారీ వర్షాలు- రహదారులు జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.