మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోస్మీ-కిస్నేలీ అటవీప్రాతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ధనోకా తాలుకా ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు మొదట కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రతిఘటనతో వారు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఐదు మృతదేహాలు లభ్యమైనట్లు వివరించారు.