ETV Bharat / bharat

'మహాఘట్​బంధన్​'లో ఎవరికెన్ని స్థానాలు- శనివారమే ప్రకటన! - congress-rjd

బిహార్​ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల నామినేషన్లకు గురువారమే నోటిఫికేషన్​ విడుదలైంది. అయితే.. ఇప్పటికీ రాష్ట్రంలో రెండు ప్రధాన కూటములు ఎన్డీఏ, మహాఘట్​బంధన్​ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అయితే.. విపక్షాల కూటమి​లో సీట్ల కేటాయింపుపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, శనివారం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

'Mahagathbandhan' finalises seat sharing, announcement likely tomorrow
'మహాఘట్​బంధన్​'లో ఎవరికెన్ని స్థానాలు- రేపే ప్రకటన!
author img

By

Published : Oct 2, 2020, 11:04 AM IST

Updated : Oct 2, 2020, 12:00 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్​ బంధన్​ సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​, రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) మధ్య సీట్ల పంపకంపై భేదాభిప్రాయాలు తలెత్తినట్లు ఊహాగానాలు వినిపించిన వేళ.. ఇరుపార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిహార్​లో రేపే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ మహాకూటమి నుంచి ఆర్​జేడీకి 145 స్థానాలు కేటాయించినట్లు ఓ సీనియర్​ నాయకుడు తెలిపారు. ఇందులో వికాస్​షీల్​ ఇన్సాన్​ పార్టీకి కొన్ని స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్​-70, ఇతర వామపక్షాలు సీపీఐ,సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్​) కలిపి 30 స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. లోక్​సభ ఉపఎన్నిక జరగనున్న వాల్మీకి నగర్​ నుంచి ఎవరు పోటీ చేసేది ఇంకా తేలలేదు. ఇక్కడ ఆర్​జేడీ, కాంగ్రెస్​ రెండు పార్టీలూ ఆసక్తి చూపిస్తున్నాయి.

ఎన్డీఏ కూడా...

అధికార కూటమి ఎన్డీఏ కూడా అక్టోబర్​ 4కు ముందే సీట్ల పంపకంపై ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.

బిహార్​లో 243 అసెంబ్లీ స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 71 స్థానాలకు అక్టోబర్​ 28న పోలింగ్ నిర్వహించనున్నారు. ​

ఇదీ చూడండి: బిహార్​ బరి: తొలిరోజు మూడు నామినేషన్లే!

Last Updated : Oct 2, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.