మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి సుప్రీంకోర్టు చేరాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను గవర్నర్ ఆహ్వానించటంపై 3 పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గవర్నర్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించాయి.
తమ 3 పార్టీలకు కలిపి 144 మందికి పైగా మద్దతుందని పిటిషన్లో స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.
ఇదీ చూడండి: 1978లో పవార్ ఇలాగే చేశారు..!