ETV Bharat / bharat

ఆలయాలపై సీఎం, గవర్నర్​ మాటల యుద్ధం - maharastra pilitics

మహారాష్ట్రలో ప్రార్థనా మందిరాలు తెరిచే విషయంలో సీఎం, గవర్నర్ మధ్య లేఖల యుద్ధం సాగింది. "సీఎం ఒక్కసారిగా లౌకికవాదిగా మారిపోయారా?" అని గవర్నర్ ప్రశ్నించగా... "నాకెవరూ హిందుత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు" అంటూ సీఎం ఠాక్రే దీటుగా బదులిచ్చారు. లేఖలో గవర్నర్​ వాడిన భాషను చూసి బాధేసిందని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ అన్నారు.

MH-THACKERAY-GOVERNOR
సీఎం, గవర్నర్​
author img

By

Published : Oct 13, 2020, 10:37 PM IST

మహారాష్ట్రలో మందిరాలు, ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంపై గవర్నర్ బీఎస్​ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే మధ్య మాటల సంగ్రామం కొనసాగుతోంది. లౌకికవాది, హిందుత్వ అన్న అంశాలపై ఇరువురి మధ్య వాడీవేడి లేఖల యుద్ధం జరిగింది.

కరోనా కారణంగా మూతపడిన ప్రార్థనా స్థలాలను తెరవాలని ఠాక్రేకు గవర్నర్ లేఖ రాశాక ఈ వివాదం మొదలైంది. లేఖలో ఠాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కోశ్యారీ.

"రాష్ట్రంలో బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లను తెరిచారు. కానీ దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇలా చేయమని భగవంతుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరు అమితంగా ద్వేషించే లౌకికవాదిగా మారారా?"

-కోశ్యారీ లేఖ సారాంశం

అదే స్థాయిలో ఠాక్రే బదులు..

ఇందుకు ఉద్ధవ్‌ ఠాక్రే దీటుగా సమాధానమిచ్చారు. ప్రార్థన మందిరాలు తెరిస్తే హిందుత్వవాది.. తెరవకపోతే లౌకికవాది అని గవర్నర్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

"లౌకికవాదం అనేది రాజ్యాంగంలోని కీలకమైన అంశం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరు ఆ విషయాన్ని మర్చిపోయారా? ఇక నాకేదో భగవంతుడి నుంచి ఆదేశాలు వచ్చాయా అని అడిగారు కదా. అలాంటివి మీకు వస్తాయేమో. నేను అంత గొప్పవాడిని కాదు. నాకెవరూ హిందుత్వ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు."

- ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

ప్రజల మత విశ్వాసాలతో పాటు వారి ప్రాణాలకు రక్షణ కల్పించడం కూడా ముఖ్యం అని తన లేఖలో వివరించారు ఠాక్రే. లౌక్‌డౌన్‌ను ఉన్నట్టుండి ఎత్తివేయడం సరికాదని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇది బాధాకరం: పవార్​

ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గవర్నర్ ఉపయోగించిన భాష చూసి షాక్​కు గురయ్యానని అన్నారు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రవర్తించటం బాధాకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు గజాల దూరం పాటించాలని మోదీ పిలుపునిచ్చారని.. అయితే ఆలయాల్లో దూరం పాటించటం అసాధ్యమైన విషయమని పవార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మందిరాలు తెరవాలని భాజపా 'మహా' ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.