ETV Bharat / bharat

ఆపరేషన్​ కరోనా: జీ20 సదస్సుపైనే అందరి దృష్టి

కరోనా కట్టడిపై చర్చే అజెండాగా జరగబోయే జీ-20 సదస్సు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. గురువారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ భేటీ జరగనుంది.

Looking forward to attending G20 summit on COVID-19: Modi
'కరోనాపై జరిగే జీ-20 సదస్సు కోసం ఎదురుచూస్తున్నా
author img

By

Published : Mar 25, 2020, 9:11 PM IST

కరోనా నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనే లక్ష్యంగా గురువారం జీ20 సదస్సు జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశం వేదికగా ఫలప్రదమైన చర్చలు జరుగుతాయని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్రమోదీ. సదస్సులో పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నానని ట్వీట్​ చేశారు.

"ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న కొవిడ్​-19 పరిష్కరించడంలో... జీ-20సదస్సు పాత్ర ఎంతో కీలకమైనది. సౌదీ నేతృత్వంలో జరగబోయే జీ-20 సదస్సులో ఈ వైరస్​ కట్టడిపై ముఖ్యమైన చర్చలు జరుపుతాం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

జీ20 కూటమిలో ఐరోపా సమాఖ్య, 19 పారిశ్రామిక దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.