కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. వచ్చే మంగళవారంలోగా ఏ రోజైనా షెడ్యూల్ విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈసారి ఎన్నికలను 7 నుంచి 8 దశల్లో నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించనుంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టతరాలేదు.