ETV Bharat / bharat

'ఎంపీల జీతాల్లో కోత' బిల్లుకు లోక్​సభ ఆమోదం - లోక్​సభ

ఎంపీల జీతాల్లో 30శాతం కోత విధిస్తూ రూపొందించిన బిల్లును లోక్​సభ ఆమోదించింది. కరోనా సంక్షోభం దృష్ట్యా కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్​లో ఈ నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్​ జారీ చేసింది.

Lok Sabha passes bill to cut salaries of MPs by 30 per cent
'ఎంపీల జీతాల్లో కోత' బిల్లుకు లోక్​సభ ఆమోదం
author img

By

Published : Sep 15, 2020, 6:32 PM IST

కరోనా వైరస్​పై పోరులో భాగంగా.. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించేందుకు రూపొందించిన బిల్లును లోక్​సభ ఆమోదించింది. 'సాలరీ, అలవెన్స్​ అండ్​ పెన్షన్​ ఆఫ్​ మెంబర్స్​ ఆఫ్​ పార్లమెంట్ ఆర్డినెన్స్​,2020​'ని ఈ తాజా బిల్లు భర్తీ చేయనుంది.

కరోనా వల్ల కలుగుతున్న నష్టాన్ని పూడ్చే ప్రక్రియలో భాగంగా.. ఎంపీల జీతాల్లో కోత విధించాలని ఈ ఏడాది ఏప్రిల్​లో కేంద్రం నిర్ణయించింది. అదే నెల 6న ఈ ప్రదిపాదనకు కేంద్ర కేబినెట్​ ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాతి రోజే ఆర్డినెన్స్​ జారీ అయింది.

వేతనాలు ఇలా...

లోక్​సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. సాధారణంగా ఎంపీలకు వేతనాల రూపంలో నెలకు రూ. లక్ష అందాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్​ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్​ నుంచి రూ. 70వేలు మాత్రమే పొందుతున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.