ETV Bharat / bharat

మే 3 వరకు లాక్​డౌన్ పొడిగింపు​- మోదీ ప్రకటన

అందరూ ఊహించినట్లుగానే దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను పొడిగించింది కేంద్రం. మే 3వరకు అమల్లో ఉండనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Lockdown will be extended across India till May 3
దేశవ్యాప్తంగా మే3 వరకు లాక్​డౌన్​: మోదీ
author img

By

Published : Apr 14, 2020, 10:27 AM IST

Updated : Apr 14, 2020, 12:18 PM IST

కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. మార్చి 24న మొదలైన 21 రోజుల లాక్​డౌన్​ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని. లాక్​డౌన్​ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నా... ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఉద్ఘాటించారు.

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనాపై భారత్​ బలమైన యుద్ధం చేస్తోందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా... వైరస్​ నివారణకు దేశ ప్రజలంతా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. యుద్ధంలో గెలిచే వరకు సహనంగా ఉండాలని వారిని కోరారు.

కొత్త మార్గదర్శకాలు.. సడలింపులు

రెండో దశలో.. లాక్​డౌన్​ అమలు మరింత కఠినంగా ఉంటుందని చెప్పారు ప్రధాని. రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని... కొత్త ప్రాంతాల్లో వైరస్​ వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు. కొత్త లాక్​డౌన్​కు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు బుధవారం వెలువడుతాయని పేర్కొన్నారు.

హాట్​స్పాట్​లుగా ప్రకటించని ప్రాంతాల్లో ఏప్రిల్​ 20 తర్వాత.. మినహాయింపులుంటాయని తెలిపారు మోదీ. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. సండలింపులను వెంటనే ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.

''ఏప్రిల్​ 20 వరకు అన్ని జిల్లాలు, స్థానిక యంత్రాగాలు, రాష్ట్రాలు... దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలి. ఆంక్షలు కఠినంగా అమలు చేయాలి. హాట్​స్పాట్​లు మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులుంటాయి.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని.

విపక్షాలకు చురకలు...

కరోనా కట్టడిలో కేంద్రం ఆలస్యంగా స్పందించిందని విపక్షాలు చేసిన విమర్శల్ని పరోక్షంగా తిప్పికొట్టారు ప్రధాని. దేశం​లో కరోనా తీవ్రంగా మారకముందే.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు మోదీ. కేసులు వందకు చేరినప్పుడే విదేశీ ప్రయాణికుల్ని ఐసోలేషన్​లో ఉంచామని.. 500 కేసులు ఉన్నప్పుడే లాక్​డౌన్​ ప్రకటించామని నొక్కిచెప్పారు.

మహమ్మారి కట్టడికి కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారేవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే.. భారత్​ మెరుగైన స్థితిలోనే ఉందని వివరించారు మోదీ.

ప్రపంచ నివేదికల ప్రకారం.. కేసులు 10 వేలు దాటితే 1500 నుంచి 1600 పడకలు అవసరం అవుతాయని.. దేశంలో ఇప్పటికే లక్షకు పైగా పడకలు ఏర్పాటుచేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా 600కుపైగా ఆసుపత్రులు, 220కిపైగా ల్యాబ్​ల్లో కరోనా నిర్ధరణ పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు ప్రధాని.

సప్తసూత్రాలు...

కరోనాను తుదముట్టించేందుకు ఏడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు మోదీ.

Lockdown will be extended across India till May 3
.

Last Updated : Apr 14, 2020, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.