ETV Bharat / bharat

9-12 తరగతుల సీబీఎస్‌ఈ సిలబస్‌ తగ్గనుందా? - సీబీఎస్‌ఈ

రానున్న విద్యా సంవత్సరంలో 9, 10, 11, 12 తరగతుల సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు జరగనున్నాయి. కరోనా విజృంభణ, లాక్​డౌన్ కారణంగా విలువైన సమయం వృథా అయిన కారణంగా... దానిని సరిచేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది.

CBSE to assess loss of time for students, rationalise syllabus for classes 9-12
తగ్గనున్న సీబీఎస్ఈ సిలబస్​
author img

By

Published : Apr 20, 2020, 9:01 AM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ) రానున్న విద్యా సంవత్సరానికి 9, 10, 11, 12 తరగతుల సిలబస్​ను హేతుబద్ధీకరించే విషయాన్ని పరిశీలిస్తోంది. కరోనా విజృంభణ, లాక్​డౌన్ కారణంగా విలువైన సమయం వృథా కావడమే ఇందుకు కారణం.

ఎన్‌సీఈఆర్‌టీ బాటలో...

నేషనల్​ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్​ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్​సీఈఆర్​టీ) 1 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ అకడమిక్​ క్యాలెండర్​ను గత వారం ప్రకటించింది. మిగతా తరగతులకూ ప్రత్యామ్నాయ క్యాలెండర్ రూపొందించే పనిలో ఉంది ఎన్​సీఈఆర్​టీ. ఇప్పుడు ఇదే బాటలో కేంద్రీయ విద్యాశాఖ పయనిస్తోంది.

అన్నీ వాయిదా...

దేశంలో కరోనా భయాలు అలముకున్న నేపథ్యంలో... మార్చి 5న లాక్​డౌన్​ ప్రకటించడానికి వారం రోజుల ముందే అన్ని పాఠశాలలు మూతపడ్డాయి. సీబీఎస్​ఈతో పాటు అనేక రాష్ట్ర బోర్డుల పరిధిలోని పరీక్షలు వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. తరువాత ఈ లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.

ఆన్​లైన్ క్లాసులు జరుగుతున్నా..

లాక్​డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో... అనేక పాఠశాలలు ఆన్​లైన్​లో బోధన, అభ్యాస కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అయితే వీటికి ఏకరూప మార్గదర్శకాలు ఏమీ లేకపోవడం గమనార్హం.

29 సబ్జెక్టులకు మాత్రమే...

ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశార్హత కల్పించే, ప్రమోట్​ చేసే కీలకమైన 29 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్​ఈ బోర్డు ఇంతకు ముందే ప్రకటించింది. అలాగే విదేశాల్లో పెండింగ్​లో ఉన్న 10,12 తరగతుల పరీక్షలను నిర్వహించేది లేదని స్పష్టం చేసింది.

పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో?

"పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో నిర్ణయించడం చాలా కష్టం. కానీ పరీక్షలు నిర్వహించడానికి కనీసం 10 రోజుల ముందస్తు నోటీసు ఇస్తాం."

- ఓ సీబీఎస్​ఈ అధికారి

జూన్​ చివర్లో..!

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్​ (జేఈఈ), నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్​ (నీట్​)తో సహా పోటీ పరీక్షలు జూన్​ చివర్లో జరిగే అవకాశం ఉందని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఇదీ చూడండి: విమాన టికెట్ల బుకింగ్​లు బంద్ : ఎయిర్​ ఇండియా​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.