ETV Bharat / bharat

రేపటి నుంచే లాక్​డౌన్​ 4.0- ఆంక్షలపై సర్వత్రా ఉత్కంఠ - lockdown 4.0 curbs

కరోనా కట్టడికి విధించిన మూడో విడత లాక్​డౌన్ నేటితో పూర్తికానుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే లాక్​డౌన్​ 4.0లో నిబంధనలు కొత్తగా ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈసారి రూల్స్ ఏలా ఉంటాయి? వేటికి అనుమతి ఉంటుంది? ఏ ఆంక్షలు కొనసాగుతాయే అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.

lockdown
రేపటి నుంచి లాక్​డౌన్​ 4.0- ఆంక్షలపై సర్వత్రా ఉత్కంఠ
author img

By

Published : May 17, 2020, 5:45 AM IST

లాక్‌డౌన్‌ 3.0 గడువు నేటితో ముగుస్తుంది. లాక్​డౌన్ 4.0లో మరిన్ని ఆంక్షలను సడిలించనున్నట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది. ఎలాంటి ఆంక్షలు విధించాలనే నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకే వదిలేయనున్నటు అధికారులు ఇప్పటికే తెలిపారు. తుది మార్గదర్శకాలకు సంబంధించి కేంద్రం ఈరోజు స్పష్టత ఇవ్వనుంది. సోమవారం నుంచి రైల్వే, దేశీయ విమాన ప్రయాణ సేవలను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్​ మాల్స్​, సినిమా హాల్స్​ దేశవ్యాప్తంగా ఎక్కడా పున:ప్రారంభించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. కంటైన్​మెంట్​ ప్రాంతాలు మినహా రెడ్​జోన్లలో​ సెలూన్లు, ఆప్టికల్ షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు.

లాక్​డౌన్ 4.0​లో అనేక ఆంక్షలు సడలించనున్నారు. గ్రీన్​ జోన్లలో అన్ని సేవలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆరెంజ్​ జోన్లలో పరిమిత ఆంక్షలు ఉంటాయని, రెడ్​ జోన్లలోని కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో మాత్రమే కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తుది మార్గదర్శకాలు ఉంటాయని పేర్కొన్నారు అధికారులు.

లాక్​డౌన్ 4.0లో రూల్స్​ ఇలా...!

  • కంటైన్​మెంట్​ ప్రాంతాలు మినహా రెడ్​జోన్లలో స్థానికంగా బస్సులు, మెట్రో సేవలకు పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో అనుమతి.
  • రెడ్​ జోన్లలో ఆటోలు, ట్యాక్సీలకు షరతులతో అనుమతి.
  • మార్కెట్లను తెరిచే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం
  • రెడ్​జోన్లలోనూ నిత్యావసరేతర వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి.
  • కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ముంబయిలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతర్​జిల్లా ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించే యోచనలో ఉంది.

ఏఏ రాష్ట్రాలు ఏమంటున్నాయి..

  • గుజరాత్​లోని పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
  • ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించేందుకు దిల్లీ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నాయి.
  • హోటళ్లు, రెస్టారెంట్లు సహా పర్యటక రంగాన్ని పునరుద్ధరించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది.
  • వలస కార్మికులు సొంత ఊళ్లకు చేరుకున్నాక కరోనా కేసులు పెరుగుతున్న బిహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి.

పంజాబ్, బంగాల్, మహారాష్ట్ర, అసోం, తెలంగాణ... లాక్​డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మేరకు గ్రీన్​, ఆరెంజ్​, రెడ్​ జోన్ల జిల్లాలను నిర్ణయించే అధికారం తమకు ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ వినతికి కేంద్రం అంగీకారం తెలిపే అవకాశముందని సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిస్థితికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను అనుమతించడం వంటి నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకునే వీలుంటుందని చెప్పారు.

ఏ రాష్ట్రమూ లాక్​డౌన్​ను పూర్తిగా ఎత్తివేయాలని కోరుకోవడం లేదని, క్రమక్రమంగా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలని భావిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రైల్వే, విమాన ప్రయాణ సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తున్నప్పటికీ ఇప్పట్లో ఇవి పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కర్ణాటక, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు రైల్వే సేవలను మే చివరి వరకు పూర్తి స్థాయిలో పునరుద్ధరించవద్దని కోరుతున్నట్లు వివరించారు. ​ఇప్పటికే దిల్లీ నుంచి 15 రైళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయని, వందే భారత్​ విషన్​లో భాగంగా విమాన సేవలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.