ETV Bharat / bharat

'కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలతో కలిసి పోరు'

ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలతో కలిసి పోరాడుతున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఔషధాలను, ఇతర సామగ్రిని భారత్​ అందిస్తున్నట్లు తెలిపారు.

LIVE: PM Modi addresses UN Economic and Social Council session
'కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలతో కలిసి పోరు'
author img

By

Published : Jul 17, 2020, 9:49 PM IST

Updated : Jul 18, 2020, 6:28 AM IST

కరోనా నియంత్రణకు అన్ని దేశాలతో కలిసి పోరాడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అందరితో కలిసి పురోగతి సాధించాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 7 కోట్ల మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములుగా చేసినట్లు తెలిపారు.

"ఈ ఏడాది మనం ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మానవ పురోగతిలో ఐరాస పాత్రను గుర్తించాలి. ప్రస్తుతం ప్రపంచంలోని 193 దేశాలను ఐరాస ఒక దగ్గరికి చేర్చింది. దేశీయ ప్రయత్నాల ద్వారా 2030 అజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మేము మళ్లీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి కూడా మేం మద్దతు ఇస్తున్నాం. సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ అనే నినాదంతో మేం ముందుకు వెళ్తున్నాం. "

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

కరోనా సంక్షోభ సమయంలో 150కి పైగా దేశాలకు కరోనా ఔషధాలు, ఇతర సామగ్రి అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. 2025 నాటికి టీబీని పారదోలటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

"అన్ని దేశాలనూ కరోనా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికి, ప్రజల సహకారంతో కొవిడ్‌ నివారణకు పోరాడగలుగుతున్నాం. అందరితో కలిసి పురోగతి సాధించాలనేదే మా నినాదం. ప్రపంచంలోనే భారత్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. 2025 నాటికి భారత్‌ నుంచి టీబీని పారదోలటం, 2022 నాటికి ప్రతి భారతీయుడికి ఆవాసం ఉండేలా చూడటమే మా ముందున్న లక్ష్యం."

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఇదీ చూడండి:'150కిపైగా దేశాలకు కరోనా ఔషధాలు అందిస్తున్నాం'

Last Updated : Jul 18, 2020, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.