ETV Bharat / bharat

'త్వరగా న్యాయం చేయండి.. నిర్భయలా చేయొద్దు'

మహారాష్ట్రలోని వార్దాలో పెట్రోల్ దాడికి గురైన యువ లెక్చరర్ ఈ రోజు మృతి చెందింది. ఈ కేసులో నిందితుడిని త్వరగా శిక్షించాలని డిమాండ్​ చేశారు ఆమె తండ్రి. నిర్భయ కేసు మాదిరిగా ఆలస్యం చేయకుండా సత్వరమే న్యాయం చేయాలని కోరారు.

Lecturer set afire by stalker dies, kin seek speedy justice
నిర్భయ కేసులా ఆలస్యం చేయవద్దు: మహారాష్ట్ర లెక్చరర్​ తండ్రి
author img

By

Published : Feb 10, 2020, 8:36 PM IST

Updated : Feb 29, 2020, 9:56 PM IST

మహారాష్ట్ర వార్దాలోని హింగాన్​ఘాట్​లో గత వారం(ఫిబ్రవరి 3) పెట్రోల్​ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కళాశాల లెక్చరర్ ఇవాళ మృతి చెందింది. కాలిన దేహంతో చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.55 గంటలకు మరణించినట్లు ఆరెంజ్ సిటీ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ఆమె మరణవార్త విన్న కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ కేసులో త్వరగా న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

"నిర్భయ కేసులాగా ఆలస్యం చేయకుండా త్వరగా కేసు విచారణ జరిపి సత్వర న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను"
- బాధితురాలి తండ్రి.

లెక్చరర్​ మృతి పట్ల మహారాష్ట్ర మఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఇతర మంత్రులు స్పందించారు.

"ఈ కేసుపై ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ జరుగుతుంది. హింగాన్​ఘాట్​ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మా ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోచ్చిన దిశ చట్టాన్ని అధ్యయనం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలను మరింత కఠినం చేయటానికి ప్రయత్నిస్తున్నాము."
-ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.

దిశ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల కేసు నమోదైన రోజు నుంచి 7 పనిదినాల్లో విచారణను పూర్తి చేసి, 14 పని దినాల్లో కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేసేలా చట్టాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం.

"ఈ కేసును ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ జరుపుతాము. అలాగే బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం."
-అనిల్​ దేశ్​ముఖ్​ మహారాష్ట్ర హోం మంత్రి.

"బాధితురాలు చనిపోవటం నాకు చాలా బాధను కలిగించింది. ఈ రోజు నేను ఏమీ మాట్లాడను. ఇలాంటి దారుణ ఘటనలపై అందరం కలిసి పోరాటం చేద్దాం."
-యశోమతి, మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి.

దారుణ హత్య...

ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతిపై.. ఫిబ్రవరి 3న ఉదయం నందోరీ చౌక్​ దారిలో వెళ్తుండగా ఆమె మాజీ ప్రియుడు విక్కీ పెట్రోల్​ పోశాడు. ​అందరూ చూస్తుండగానే శరీరానికి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న యువతిని రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అనంతరం పరిస్థితి విషమంగా ఉందని నాగ్​పుర్​ ఆసుపత్రికి మార్చారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో పెట్రోల్ దాడికి గురైన లెక్చరర్ మృతి

ZCZC
PRI ERG ESPL NAT
.SERAMPORE CES10
WB-TMC-SUICIDE
TMC councillor commits suicide by jumping in front of train:
Police
         Serampore (WB), Feb 10 (PTI) A woman TMC councillor of
Serampore Municipality in West Bengal on Monday allegedly
committed suicide by jumping in front of an approaching train,
police said.
         Forty eight-year-old Rama Nath, councillor of ward
number 16 of the civic body in Hooghly district, allegedly
jumped in front of a local train when it was approaching the
Serampore railway station around 11.30 am, Chandannagar police
commissioner Humayun Kabir said.
         Nath was taken to a hospital, where doctors declared
her brought dead, he said.
         "Prima facie, it seems to be a case of suicide but we
are investigating it," Kabir said.
         District TMC president Dilip Yadav distanced the party
from the incident.
         "She had very good relations will all of us and I had
spoken to her a few days ago. This incident is not related to
politics, our party or the municipality," Yadav said, after
visiting the hospital.
         One of Nath's relatives said she was possibly
depressed. PTI CORR
ACD
ACD
02101724
NNNN
Last Updated : Feb 29, 2020, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.