ETV Bharat / bharat

ప్రాణాలను పణంగా పెట్టి.. 'కాలువ'లో ప్రయాణం

దేశంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మహారాష్ట్రలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల.. వందలాది కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా మురుగు కాలువలో నడుచుకుంటూ స్వస్థలాలకు బయలుదేరారు.

Laborers travelling in Nullah to evade police blockade
వలస కార్మికుల కష్టాలు.. 'నల్లా'యే వారి గమ్యానికి మార్గం
author img

By

Published : May 11, 2020, 1:09 PM IST

Updated : May 11, 2020, 1:25 PM IST

వలస కార్మికుల కష్టాలు

లాక్​డౌన్​ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకున్న వలస కార్మికులు.. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వైరస్​ కట్టడిలో భాగంగా విధించిన ఆంక్షల నడుమ.. మహారాష్ట్రలో రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. గత్యంతరం లేని వందలాది కూలీలు... ప్రాణాలను పణంగా పెట్టి రాత్రి వేళల్లో మురుగు కాలువల్లో నడుచుకుంటూ తమ గ్రామాలకు ప్రయాణమయ్యారు. ఈ ఘటన ఠాణెలో చోటు చేసుకుంది. వీరిలో చిన్నారులు, మహిళలూ ఉన్నారు. వీరంతా ముంబయి నుంచి నాసిక్​కు బయలుదేరారు.

Laborers travelling in Nullah to evade police blockade
కాలువలో ప్రయాణం

కొంతమంది స్థానికులు చూసి కూలీల దయనీయ పరిస్థితికి జాలిపడ్డారు. వారికి నీరు, ఆహారం అందించి ఆసరాగా నిలిచారు.

గత మూడురోజుల్లో వేలాది మంది వలస కార్మికుల కుటుంబాలు ముంబయి నుంచి ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​లోని తమ స్వగ్రామాలకు చేరుకోవాలని ఇదే తరహాలో అవస్థలు ఎదుర్కొంటూ బయలుదేరారు.

ప్రమాదకర పయనం

Last Updated : May 11, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.