ETV Bharat / bharat

కర్​నాటకం: మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా - karnataka govt

కర్ణాటక కూటమి సంక్షోభం మరింత తీవ్రం అయింది. బుధవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు స్పీకర్​ రమేశ్​ కుమార్​ ధ్రువీకరించారు. అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది.

కర్​నాటకం: మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
author img

By

Published : Jul 10, 2019, 5:58 PM IST

కర్ణాటక కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి ప్రభుత్వం సంక్షోభం నుంచి కోలుకునే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. బుధవారం మరో ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. వీరిలో 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్​, ఎమ్మెల్యే డా.కె.సుధాకర్​ రాజీనామా సమర్పించినట్లు స్పీకర్​ రమేశ్​ కుమార్ ధ్రువీకరించారు.

రాజకీయాలతో విసిగిపోయి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా అనంతరం నాగరాజ్​ తెలిపారు.

రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు గవర్నర్​ను కలిసేందుకు బెంగుళూర్​లోని రాజ్​భవన్​ చేరుకున్నారు.

స్పీకర్‌ రాజీనామాలు ఆమోదిస్తే కాంగ్రెస్‌-జేడీఎస్‌ బలం 101కే పరిమితం కానుంది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224. రాజీనామాలను సభాపతి ఆమోదిస్తే ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది. అధికారంలో కొనసాగాలంటే కనీసం 105 మంది సభ్యుల మద్దతు అవసరం.

Intro:Body:

u

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.