పొడవైన విషసర్పంగా పేరున్న తాచుపాము మొట్టమొదటిసారి చాలా ఎత్తయిన ప్రదేశంలో దర్శనమిచ్చింది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా ముక్తేశ్వర్‌లో 2,400 మీటర్ల ఎత్తులో దీని జాడ కనిపించింది. ఇప్పటివరకు ఇలాంటి సర్పాలు కనిపించిన ప్రాంతాల్లో ఇదే ఎత్తయినది.
ఆ రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసింది. సాధారణంగా విష సర్పాలు వెచ్చని వాతావరణంలో నివాసముంటాయి. అయితే శీతకాలంలో ముక్తేశ్వర్‌లో సున్నా డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
ఇప్పటివరకు సిక్కింలో 1,840 మీటర్లు, నీలగిరి కొండల్లో 1,830 మీటర్లు, మిజోరంలో 1,170 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లోనే ఇవి కనిపించాయి.
ఇదీ చూడండి: రోజువారీ కేసుల్లో ఆ దేశాలను దాటేసిన భారత్