దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 9,060 కేసులు నమోదయ్యాయి. మరో 150మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 15,95,381కి చేరగా.. మరణాల సంఖ్య 42,115కి చేరింది.
- కర్ణాటకలో మరో 7,012 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరో 51మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 65వేల 586కు చేరింది. మృతుల సంఖ్య 10,478కి పెరిగింది.
- కేరళలో మరో 7,631 వైరస్ కేసులు వెలుగుచూశాయి. మరో 22 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2.45 లక్షల మందికిపైగా వైరస్‌ను జయించారు. 95వేల 200 మంది చికిత్స పొందుతున్నారు.
- దిల్లీలో వైరస్ వ్యాప్తి మళ్లీ తీవ్రమైనట్టు కనిపిస్తోంది. ఒక్కరోజే 3,299 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 3లక్షల 31వేల 17కు చేరింది. మరో 28 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 6వేలు దాటింది.
- తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఒక్కరోజులో 3,914 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 6లక్షల 87వేల 400కు పెరిగింది. వైరస్ కారణంగా మరో 56 మంది చనిపోవడం వల్ల మొత్తం మరణాల సంఖ్య 10,642కు చేరింది.
ఇదీ చదవండి: వచ్చే ఫిబ్రవరి కల్లా చివరి దశకు కరోనా!