ETV Bharat / bharat

కేరళలో జోరుగా రెండో దఫా స్థానిక సమరం

author img

By

Published : Dec 10, 2020, 11:16 AM IST

Updated : Dec 10, 2020, 11:36 AM IST

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఐదు జిల్లాల్లో మొత్తం 451 స్థానిక సంస్థలకు ఓటింగ్​ జరుగుతోంది.

KERALA LOCAL BODY POLLS
కేరళలో జోరుగా రెండో దఫా స్థానిక సమరం

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

KERALA LOCAL BODY POLLS
క్యూలో నిల్చున్న ఓటర్లు
KERALA LOCAL BODY POLLS
కొవిడ్​ భద్రత చర్యల నడుమ ఓటింగ్..

ఐదు జిల్లాల(కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్​, పాలక్కడ్​, వయనాడ్​)లో మొత్తం 451 స్థానిక సంస్థల పరిధిలోని 8,116 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లక్షా 23వేల 643 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. వీటిలో 473 సమస్యాత్మకమైనవిగా పేర్కొంటూ.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం 63,187 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

KERALA LOCAL BODY POLLS

KERALA LOCAL BODY POLLS

ఈ నెల 14న చివరి దశ పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్), నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) మధ్య జరుగుతున్న త్రిముఖ పోరులో.. అన్ని పార్టీల నాయకులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనానా..? ఆ ఊసే లేదక్కడ!

Last Updated : Dec 10, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.