ETV Bharat / bharat

'దిల్లీలోనే ఈ స్పెషల్ రూల్స్ ఎందుకు?' - అనిల్​ బైజాల్​

కరోనా బాధితులకు హోం ఐసోలేషన్​ను రద్దు చేస్తూ దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ జారీ చేసిన ఆదేశాలను అరవింద్​ కేజ్రీవాల్​ వ్యతిరేకించారు. ఈ ఆదేశాలు ఐసీఎంఆర్​ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Kejriwal opposes LG order on home isolation of COVID-19 patients
లెఫ్టినెంట్​ గవర్నర్​ వర్సెస్​ కేజ్రీ.. కారణం?
author img

By

Published : Jun 20, 2020, 4:51 PM IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​పై మరోమారు అసహనం వ్యక్తం చేశారు. దిల్లీలోని కరోనా బాధితులకు ఐదురోజుల పాటు ఇన్​స్టిట్యూషనల్​ క్వారంటైన్​ను విధించిన గవర్నర్​ ఆదేశాలను వ్యతిరేకించారు కేజ్రీవాల్​. దిల్లీలోనే ప్రత్యేక నియమాలు ఎందుకుండాలని డీడీఎమ్​ఏ సమావేశం వేదికగా ప్రశ్నించారు.

లక్షణాలు లేని వారు, తేలికపాటి లక్షణాలున్న కరోనా బాధితులకు ఐసీఎంఆర్​ హోం క్వారంటైన్​ను సూచించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యమంత్రి.

"లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్న బాధితులే అధికంగా ఉన్నారు. మరి వారి కోసం ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఐసోలేషన్​ కోసం రైల్వే అందించిన బోగీలు చాలా వేడిగా ఉన్నాయి. అందులో బాధితులు ఉండలేరు. గవర్నర్​ ఆదేశాలు ఐసీఎంఆర్​ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి."

-- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

అయితే.. గవర్నర్​ ఆదేశాలు, ప్రవేటు ఆసుపత్రుల్లోని పడకల రేట్ల విషయంపై సమావేశంలో ఎలాంటి నిర్ణయానికి రాలేదని ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా వెల్లడించారు.

ఇదీ చూడండి:- మంచంపై పడుకుని లాయర్​ వాదనలు- సుప్రీం ఫైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.