ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వీరు ఇకపై ఆయా పదవుల్లో కొనసాగడానికి అర్హత కోల్పోయారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
-
Governor Kalyan Singh and Niti Aayog Vice Chairman Rajiv Kumar must resign immediately.
— P. Chidambaram (@PChidambaram_IN) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
After the indictment by the Election Commission, they have no right to remain in office.
">Governor Kalyan Singh and Niti Aayog Vice Chairman Rajiv Kumar must resign immediately.
— P. Chidambaram (@PChidambaram_IN) April 6, 2019
After the indictment by the Election Commission, they have no right to remain in office.Governor Kalyan Singh and Niti Aayog Vice Chairman Rajiv Kumar must resign immediately.
— P. Chidambaram (@PChidambaram_IN) April 6, 2019
After the indictment by the Election Commission, they have no right to remain in office.
కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్'ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ విమర్శించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంపై ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇంతకు ముందు రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆ పార్టీ కార్యకర్తలతో అన్నారు. ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడమేనని ఎలక్షన్ కమిషన్ సోమవారం స్పష్టం చేసింది.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కల్యాణ్‌సింగ్, రాజీవ్‌కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడాన్ని ఈసీ తప్పుబట్టింది. అందుకే వారు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు చిదంబరం.
ఇదీ చూడండి: అనుమానంతో గర్ల్‌ఫ్రెండ్‌పై కత్తి దాడి