దేశం మొత్తం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. మిడతలు మరో పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేసిన ఈ కీటకాలు రాజస్థాన్‌ను వణికిస్తున్నాయి. తాజాగా జోధ్‌పుర్ నగరంలోకి ప్రవేశించి.. ప్రజలకు చుక్కలు చూపించాయి. 24 గంటల్లో వేల మొక్కలను నాశనం చేశాయి. ఈ క్రమంలో మిడతల విధ్వంసం గురించి అధికారులకు తెలియజేసినా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.
స్పందించలేదు..!
జోధ్‌పుర్‌లోని సరస్వతినగర్తో పాటు కుడి భగ్తసాని, మధుబన్ హౌసింగ్ బోర్డ్ ,బస్నీ ప్రాంతాల్లో ఈ మిడతల దండు బీభత్సం సృష్టించాయి. వీటిని తరిమికొట్టేందుకు టపాసులు పేల్చినప్పటికి అవి వదిలి వెళ్లట్లేదని స్థానికులు తెలిపారు. జిల్లా అధికారులు సహా పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్‌కు విషయం తెలియజేసినప్పటికి ఎవరూ సహయక చర్యలకు ముందుకు రాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని వ్యవసాయ అధికారులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
"నివాసితులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మిడతలు వాలిన కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఈ కీటకాలు జనావాస ప్రాంతాలకు దూరంగా వెళ్లిన తర్వాతే రసాయన కారకారలు స్ప్రే చేసి వాటిని తరిమికొట్టేందుకు చర్యలు తీసుకోగలం"అని వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి తెలిపారు.
ఇదీ చూడండి:'కరోనాపై పోరులో 'బాహుబలి' ప్రధాని విఫలం'