ETV Bharat / bharat

అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​

జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్​ ఉండనున్నాయి. ఈ నిర్ణయంతో దేశంలో వైశాల్యపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా నిలవనుంది  జమ్ముకశ్మీర్​.

అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​
author img

By

Published : Aug 6, 2019, 5:21 AM IST

Updated : Aug 6, 2019, 9:46 AM IST

అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​

కేంద్రప్రభుత్వం సోమవారం జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాష్ట్రాన్ని.. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్​గా విభజించింది. ఇప్పటికే ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో వైశాల్యపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా నిలవనుంది జమ్ముకశ్మీర్​. దాని తర్వాతి స్థానంలో లద్దాఖ్​ ఉండనుంది.

కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు పీడీపీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. లద్దాఖ్​ ప్రజల్లో ఎప్పటి నుంచో ఈ డిమాండ్​ ఉంది. విభజన బిల్లును అక్కడి కొన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.

దిల్లీ, పుదుచ్చేరి సరసన జమ్ముకశ్మీర్​...

ప్రస్తుతం ప్రకటించిన రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 9 కేంద్రపాలిత ప్రాంతాలు కానున్నాయి. వీటిలో దిల్లీ, పుదుచ్చేరిలకు శాసనసభలు ఉండగా.. ఇపుడు జమ్ముకశ్మీర్‌ ఈ జాబితాలో చేరింది. దమన్‌ దీవ్​, దాద్రానగర్ హవేలీ, చండీగఢ్‌, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండగా.. లద్దాఖ్​ వీటి సరసన చేరింది. యూటీల్లో దిల్లీ నుంచి అత్యధికంగా ఏడుగురు ఎంపీలు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇప్పుడు జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉండనున్నారు. జమ్ముకశ్మీర్​ విభజన బిల్లుతో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28కి చేరగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది.

అసెంబ్లీ స్థానాలు 114కు పెంపు...

జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన అనంతరం.. కేంద్రపాలిత ప్రాంతంగా రూపుదిద్దుకునే జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 107గా ఉన్న శాసనసభ స్థానాలు 114కు చేరనున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ సీట్లకు రిజర్వేషన్లు అమలుచేయనున్నారు.

ఇప్పటివరకు కశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌ రీజియన్లుగా వ్యవహరించేవారు. జమ్ములో 10, కశ్మీర్‌లో 10, లద్దాఖ్‌లో రెండు జిల్లాలు ఉండేవి. లెహ్​, కార్గిల్​ జిల్లాలతో లద్దాఖ్​ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండనుంది.

ఇదీ చూడండి:

ఆపరేషన్​ కశ్మీర్​: భగ్గుమన్న రాజ్యసభ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding Belgium. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Valkenburg, Netherlands - 26th April 2019.
1. 00:00 Various of Bjorg Lambrecht talking to journalists
2. 00:07 Lambrecht on bike next to team bus
3. 00:11 Lambrecht puts on hat, has a drink while on bike
4. 00:21 Lambrecht talking to journalists
SOURCE: VTM
DURATION: 00:33
STORYLINE:
Belgian cyclist Bjorg Lambrecht has died after crashing in the Tour of Poland. He was 22.
His team Lotto Soudal announced on Monday that Lambrecht had fallen during the third stage of the event and that he was taken to hospital, where he died.
The team said in a statement on Twitter: "The biggest tragedy possible that could happen to the family, friends and teammates of Bjorg has happened. ... Rest in peace Bjorg."
Lotto Soudal did not provide additional details.
Lambrecht had secured a series of strong finishes during one-day classics in the spring and was named most promising youngster in the June tour of the Dauphine, a preparatory event of the Tour de France.
Last Updated : Aug 6, 2019, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.