ETV Bharat / bharat

మంచు రక్కసి బీభత్సం-జవాన్​ మృతి - హిమపాతం

జమ్ముకశ్మీర్​లో హిమపాతం అలజడి సృష్టిస్తోంది. మంచు వల్ల పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కుప్వారా జిల్లాలో మంచు చరియలు విరిగిపడి ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

J&K: Snow avalanche hits army post in Kupwara, 1 dead, 2 injured
మంచు రక్కసి బీభత్సం-జవాన్​ మృతి
author img

By

Published : Nov 18, 2020, 6:16 PM IST

Updated : Nov 18, 2020, 6:25 PM IST

జమ్ముకశ్మీర్​లో మంచు భారీగా కురుస్తోంది. ఉత్తర కశ్మీర్​లోని కుప్వారా జిల్లాలో మంచు చరియలు విరిగిపడి ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న తంగ్​ధార్ సెక్టార్​ జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

"తంగ్​ధార్​కు మేం బుధవారమే చేరుకున్నాం. ముగ్గురు సైనికులపై మంచు చరియలు విరిగిపడ్డాయి. గాయాలతో ఉన్న వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాము. కానీ, దురదృష్టవశాత్తు నిఖిల్ శర్మ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. "

- సైనికాధికారులు

ప్రయాణానికి ఇబ్బందులు..

మంచు రక్కసి బీభత్సం-జవాన్​ మృతి

జమ్ముకశ్మీర్​లో భారీగా కురుస్తోన్న మంచుతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచును తొలగిస్తూ.. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పలు చోట్ల వన్​-వే ట్రాఫిక్​ను అందుబాటులోకి తెచ్చారు. పూంచ్​లోని షోపియాన్​ నుంచి బఫిలాజ్​ వెళ్లే మార్గాన్ని ప్రయాణించేందుకు అనువుగా మార్చారు.

పిర్​ పంజాల్ కనుమ​ ప్రాంతంలో మూడు రోజులుగా అధికంగా మంచు కురుస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగమే: అమిత్​ షా

Last Updated : Nov 18, 2020, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.