ETV Bharat / bharat

కరోనా దెబ్బతో భారీగా తగ్గిన జేఈఈ హాజరు శాతం - జేఈఈ మెయిన్స్​ 2020

ఇంజినీరింగ్​ కళాశాలల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా గతవారం నిర్వహించిన జేఈఈ- మెయిన్స్​ పరీక్షకు 74 శాతం హాజరు నమోదైందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షకు 8.58లక్షల దరఖాస్తులు రాగా 6.35లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపింది.

JEE Mains: 74 per cent registered candidates appeared for September exam
జేఈఈ మెయిన్స్​ పరీక్షకు 74% హాజరు నమోదు
author img

By

Published : Sep 10, 2020, 6:17 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 నిబంధనల మధ్య ఈ నెల 1 నుంచి 6 వరకు జరిగిన జేఈఈ- మెయిన్స్​ పరీక్షలకు 74శాతం మంది హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఇది 94.32 శాతంగా నమోదైందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

ఇంజినీరింగ్​ కళాశాలల్లో ప్రవేశం కోసం ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షకు ఈ సారి 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 6.35 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని విద్యా శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది జనవరిలో 94.11 శాతం, ఏప్రిల్​లో 94.15 శాతం మంది పరీక్షలు రాశారు.

అయితే.. కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన తాజా గణాంకాలను తప్పుపట్టారు భాజపా నేత సుబ్రమణియన్​ స్వామి. విద్యా శాఖ వాస్తవ హాజరు శాతాన్ని దాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 9.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని గతంలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన విద్యాశాఖ.. తాజాగా ఆ సంఖ్యను 8.58 లక్షలకు తగ్గించిందని ఆరోపించారు.

ఇదీ చదవండి: నవ్యాలోచనతో ప్రవేశ పరీక్ష లేకుండా చేయలేమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.