65 కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు జమ్ముకశ్మీర్ పోలీసులు. ఇద్దరు ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
కుప్వారాలో సైన్యంతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో 13.5 కిలోల మాదకద్రవ్యాలతో పాటు, రెండు పిస్టోళ్లు, నాలుగు గ్రనేడ్ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.
"కుప్వారా పోలీసులు సైన్యంతో కలిసి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రస్థావరాల్లోంచి రూ. 65 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు."
-కశ్మీర్ రెడ్‌జోన్ పోలీసు
దీంతో అనుమానితులపై కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు పోలీసులు.
ఇదీ చదవండి: వెనక్కి తగ్గిన నేపాల్.. క్యాంప్, వాచ్ టవర్ తొలగింపు