ETV Bharat / bharat

సామాన్యుడి సైకిలెక్కిన ఇవాంక ట్రంప్!

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఇటీవలే భారత్​లో పర్యటించారు. ట్రంప్​ కుమార్తె ఇవాంక దిగిన ఫొటోలకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభించింది. ఆమెతో ఫొటో దిగలేని కొందరు ఔత్సాహికులు ఫొటోషాప్​లో ఎడిట్​ చేసుకున్న చిత్రాలను పోస్ట్​ చేశారు. నెట్టింట వైరల్​ అయిన వీటిని చూసి ఇవాంక స్పందించారు.

ivanka
సామాన్యుడి సైకిలెక్కిన ఇవాంక ట్రంప్!
author img

By

Published : Mar 1, 2020, 9:42 PM IST

Updated : Mar 3, 2020, 2:28 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు నెటిజన్లు ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఇవాంకతో తాము కూడా ఫొటో దిగినట్లు ఎడిట్​ చేసిన చిత్రాలను కొందరు పోస్ట్ చేశారు. వీటిపై తాజాగా స్పందించారు ఇవాంక. భారత్​లో తనకు అనేకమంది స్నేహితులయ్యారని పేర్కొంటూ ఆయా పోస్టులను రీట్వీట్ చేశారు.

ఇవాంకను తాజ్ తీసుకెళ్లిన దిల్​జీత్..

తాజ్​మహల్​ వద్ద ఇవాంక ట్రంప్​తో తాను ఫొటో దిగినట్లు 'ఉడ్తా పంజాబ్' చిత్రం ఫేమ్ దిల్​జీత్ దోసాంజె ఫొటోషాప్ చిత్రాన్ని పోస్ట్​ చేశాడు. తాజ్​ మహల్​ వద్దకు తీసుకెళ్లాలని ఇవాంక పట్టుబట్టిన కారణంగా చారిత్రక కట్టడం వద్దకు వెళ్లినట్లు వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించారు ఇవాంక. తనను తాజ్​ వద్దకు తీసుకెళ్లినందుకు దిల్​జీత్​కు కృతజ్ఞతలు చెప్పారు. తన పోస్ట్​కు స్పందించినందుకు ఇవాంకకు ట్విట్టర్​ వేదికగా థ్యాంక్స్ చెప్పాడు దిల్​జీత్. ఈసారి భారత్​కు వస్తే లూథియానాకు రావాలని ఆహ్వానించాడు.

సామాన్యుడి సైకిల్​పై అధ్యక్షుడి కుమార్తె

ఆదిత్య చౌదరీ అనే సామాన్యుడు పోస్ట్​ చేసిన ఫొటోషాప్​ చిత్రాన్ని రీట్వీట్ చేశారు ఇవాంక. తాను ఇవాంకను సైకిలెక్కించుకుని తొక్కుతున్నట్లు మార్చిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఈ చిత్రం వైరల్​గా మారి ఇవాంకను చేరింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ఇవాంక తాను భారత్​లో నూతన స్నేహితులను సంపాదించుకున్నట్లు రీట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: 'మోటేరా సభ చూసిన తర్వాత ఏదీ పెద్దదిగా లేదు'

Last Updated : Mar 3, 2020, 2:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.