ETV Bharat / bharat

మిడతల దాడితోనూ లబ్ధి చేకూర్చే 'సాంకేతికత'!

మిడతలు దండయాత్ర చేస్తున్న వేళ వాటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయితే మిడతలను సజీవంగా పట్టుకుని.. కోళ్లకు ఆహారంగా లేదా ఎరువులుగా ఉపయోగించుకుని ఈ విపత్తు నుంచి లబ్ధిపొందేందుకు తమిళనాడులోని ఓ అంకుర సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సాంకేతికతను వినియోగించుకుంటోంది.

Invasion of Locusts: Start-Up Engaged in Finding Solution Through Technology
మిడతల దాడిలో కొత్త ట్విస్ట్​.. ఆ ప్రోటీన్లతో ఆహారం!
author img

By

Published : Jun 3, 2020, 9:50 AM IST

ఎలాంటి సమస్య నుంచి అయినా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం భారతీయులకు అలవాటు. ఇప్పుడు మిడతల సంక్షోభంలోనూ ఇదే జరిగేలా ఉంది. తమిళనాడుకు చెందిన ఓ అంకుర సంస్థ.. మిడతల దాడి నుంచి ప్రయోజనం పొందేలా వినూత్న ప్రయత్నం చేస్తోంది. మిడతలను సజీవంగా పట్టుకుని వాటిలోని ప్రోటీన్లను వాడుకోవాలని చూస్తోంది. కోళ్లకు ఆహారంగా అందించాలని లేదా ఎరువుల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది.

ప్రోటీన్లు ఎక్కవ...

కరోనా సంక్షోభం ముగియకుండానే దేశాన్ని మరో సమస్య పట్టి పీడిస్తోంది. అదే మిడతల దండయాత్ర. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న మిడతలు.. ఇప్పటికే వేలాది పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు దక్షిణ భారతంవైపు దూసుకొస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వీపరీతంగా రసాయనాల పిచికారీ చేపడుతున్నాయి. ఇవి మనిషికి హానికరమని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషపూరిత రసాయనాల వాడకం వల్ల మిడతల బాధ తప్పినా.. భూసారం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

అయితే తమిళనాడు తిరుచిరాపల్లికి చెందిన అంకుర సంస్థ ప్రొపెల్లర్​ టెక్నాలజీస్​.. మిడతల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని, వాటిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. మిడతలను సజీవంగా పట్టుకుని ఎరువులకైనా, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఆహారంగానైనా అందించాలని చూస్తోంది. ఇందుకోసం సాంకేతికతను వాడుకుంటోంది.

"మిడతల దాడిని ఎదుర్కోవడానికి రసాయనాలను ఎక్కువగా వాడుతున్నారు. పురుగుల మందును భారీ మోతాదులో పిచికారీ చేస్తున్నారు. వీటితో మిడతలు చచ్చిపోవచ్చు కానీ పంట కూడా భారీగా నష్టపోతుంది. మిడతల్లో ప్రోటీన్లు అధికం. దీనిని మనం ఉపయోగించుకోవాలి. మిడతల దాడితో లబ్ధిపొందాలి. ఇందుకోసం సాంకేతికతను వాడుకోవాలి."

-- ఆషిక్​ రెహమాన్,​ ప్రొపెల్లర్​ టెక్నాలజీస్​.

ఎలా పట్టుకుంటారు?

మిడతలను ఎలా పట్టుకుంటారంటే.. ముందుగా థర్మల్​ కెమెరాలు ఉన్న డ్రోన్లను రంగంలోకి దింపుతారు. అవి గాలి ప్రయాణాన్ని గుర్తిస్తాయి. అందువల్ల మిడతలు ఏవైపు నుంచి వస్తాయో, ఎక్కడ పాగా వేస్తాయో అర్థమవుతుంది. అంటే వాటి రాకను 20-25 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టవచ్చు.

అనంతరం వాటికి గాలెం వేయడానికి మూడు విధానాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఫెరోమొన్స్​. ఓ పురుగు మరో పురుగును సంప్రదించడానికి ఈ ఫెరోమొన్స్​ను ఉపయోగించుకుంటుంది. రెండోది... యూవీ కిరణాలతో మిడతలను ఆకర్షించడం.

ప్రత్యేకంగా తయారు చేసిన భారీ నెట్​ను ఉపయోగించి.. వాటిలో ఉన్న ప్రతిధ్వని ఆధారంగా వాటిని పట్టుకోవడం మూడో ప్రక్రియ. ఇందులో నెట్​లు మూడు రకాలుగా ఉంటాయి. మిడతలు దాడి చేస్తాయని ముందే గుర్తించిన ప్రదేశాల్లో వీటిని భూమిపై పరుస్తారు. అనంతరం పది డ్రోన్ల సహాయంతో భీకర శబ్ధం సృష్టిస్తారు. ఈ శబ్ధానికి మిడతలు కదలలేని పరిస్థితిలో ఉంటాయి. అనంతరం నెట్ల ద్వారా లేక యూవీ కిరణాలతో వాటిని పట్టుకుంటారు.

అయితే మిడతలు ప్రాణాలతో ఉంటేనే ఉపయోగమని, వాటిలోని పోషకాలను కోళ్లకు పంచిపెట్టాలని ఆషిక్​ తెలిపారు. రాజస్థాన్​లో మిడతల బిర్యాని ఇప్పటికే బాగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్​ మీద 25 ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మిడతలను చంపకుండా.. వాటిని సజీవంగా పట్టుకుని ఉపయోగించుకుంటే రైతులు లబ్ధిపొందుతారని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.