ETV Bharat / bharat

కేరళలో మరో ఏనుగు మృతి.. కారణం అదేనా? - కేరళలో మరో గజరాజు మృతి

కేరళ మలప్పురం​లో తీవ్రంగా గాయపడ్డ ఓ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. అయితే ఇతర ఏనుగులతో జరిగిన పోరాటం వల్లే ఆ గజరాజు గాయపడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Injured male elephant dies in Kerala; Fight with other tuskers suspected
కేరళలో మరో గజరాజు మృతి
author img

By

Published : Jun 9, 2020, 1:41 PM IST

కేరళలో మరో ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు ఆ గజరాజుకు చికిత్స అందించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇతర ఏనుగులతో జరిగిన పోరాటంలో ఈ గజరాజు తీవ్రంగా గాయపడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

తీవ్రంగా గాయపడి, బలహీనపడ్డ ఏనుగును గతవారం మలప్పురం జిల్లాలోని అర్థలకున్ను ప్రాంతంలో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే చికిత్స మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. ఏనుగుపై ఉన్న గాయాలు మనిషి చేసినవి కాదని మన్నర్​కడ్​ విభాగ అటవీశాఖ అధికారి సజికుమార్​ స్పష్టం చేశారు.

"తొలుత ఏనుగు ఆరోగ్యం కొంతమేర కుదుటపడింది. కానీ గజరాజును రక్షించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇతర ఏనుగులతో జరిగిన పోరాటంలో ఈ ఏనుగు గాయపడి ఉండొచ్చు. ఏనుగును పరీక్షించిన వైద్యులు కూడా ఇదే చెప్పారు. గజరాజు నాలుక, ఉదరంపై తీవ్రంగా గాయాలయ్యాయి."

-- సజికుమార్​, మన్నర్​కడ్​ విభాగ అటవీశాఖ అధికారి.

వెటర్నరీ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వైద్య బృందం ఏనుగుకు శవపరీక్ష జరిపి.. మృతికి గల కచ్చితమైన కారణాలను ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు.

గత నెలలో కేరళలో పైనాపిల్​ బాంబు తిని ఓ గర్భంతో ఉన్న ఏనుగు మరణించింది. ఈ ఉదంతం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఇలాంటి తరుణంలో అదే రాష్ట్రంలో మరో గజరాజు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఇదీ చూడండి:- మానవతప్పిదాలతో అక్కడ పదేళ్లలో 64 ఏనుగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.